సుమిత్‌ శుభారంభం | Good start Sumit | Sakshi
Sakshi News home page

సుమిత్‌ శుభారంభం

Published Wed, Jul 17 2024 4:07 AM | Last Updated on Wed, Jul 17 2024 4:07 AM

Good start Sumit

బస్టాడ్‌ (స్వీడన్‌): నోర్డియా ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 68వ ర్యాంకర్‌ సుమిత్‌ 6–4, 6–3తో ఇలియాస్‌ యామెర్‌ (స్వీడన్‌)పై గెలుపొందాడు. 

98 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ రెండు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశాడు. రెండో రౌండ్‌లో ప్రపంచ 36వ ర్యాంకర్‌ మరియానో నవోన్‌ (అర్జెంటీనా)తో సుమిత్‌ తలపడతాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement