మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత కథ ముగిసింది. బరిలో ఉన్న ఏకైక భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ టొమాస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 91వ ర్యాంకర్ నగాల్ 3–6, 1–6, 5–7తో ఓడిపోయాడు. 2 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 20 అనవసర తప్పిదాలు చేశాడు. 19 విన్నర్స్ కొట్టిన నగాల్ తన సరీ్వస్‌ను ఏడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్‌లో ఓడిన నగాల్‌కు 1,32,000 ఆ్రస్టేలియన్ డాలర్ల (రూ. 69 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
హైదరాబాద్ తూఫాన్స్ విజయం
రూర్కెలా: పురుషుల హాకీ ఇండియా లీగ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. వేదాంత కళింగ లాన్సర్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 5–1 గోల్స్ తేడాతో గెలిచింది. తూఫాన్స్ తరఫున గొంజాలో పిలాట్ (6వ, 30వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... మైకో కసెల్లా (21వ నిమిషంలో), టిమ్ బ్రాండ్ (47వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. కళింగ లాన్సర్స్ జట్టుకు అలెగ్జాండర్ హెండ్రిక్స్ (5వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ తూఫాన్స్ జట్టు 10 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో తమిళనాడు డ్రాగన్స్‌తో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టు ఆడుతుంది.
ఒడిశా వారియర్స్ బోణీ
రాంచీలో ఆదివారం మొదలైన తొలి మహిళల హాకీ ఇండియా లీగ్‌లో ఒడిశా వారియర్స్ జట్టు శుభారంభం చేసింది. ఒడిశా వారియర్స్ 4–0 గోల్స్ తేడాతో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టును ఓడించింది. ఒడిశా వారియర్స్ తరఫున యిబ్బీ జాన్సెన్ (16వ, 37వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా... బల్జీత్ కౌర్ (42వ నిమిషంలో), ఫ్రీక్ మోయిస్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్‌తో జేఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment