
న్యూయార్క్: భారత టెన్నిస్ యువ సంచలనం సుమీత్ నాగల్ కొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. శుక‍్రవారం జరిగిన తన చివరి క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌లో నాగల్ 5-7, 6-4, 6-3 తేడాతో జోవా మెనిజెస్(బ్రెజిల్)పై గెలిచాడు. దాంతో యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు క్వాలిఫై అయ్యాడు. 22 ఏళ్ల నాగల్ తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ, ఆపై వరుస రెండు సెట్లలో విజృంభించి ఆడాడు.
పాన్ అమెరికన్ స్వర్ణ పతక విజేత అయిన మెనిజెస్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెండు, మూడు సెట్‌లను కైవసం చేసుకున్నాడు. ఫలితంగా పిన్న వయసులోనే భారత్ నుంచి యూఎస్ ఓపెన్‌కు అర్హత సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. యూఎస్ ఓపెన్‌లో తన తొలి మ్యాచ్‌ను టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్‌తో తలపడనున్నాడు. మంగళవారం జరుగనున్న తొలి రౌండ్ పోరులో ఫెడరర్‌తో సుమీత్ నాగల్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
2015 వింబుల్డన్ జూనియర్ బాయ్స్ డబుల్స్ చాంపియన్ అయిన సుమీత్.. యూఎస్ ఓపెన్‌కు అర్హత సాధించే క్రమంలో ఆద్యంతం ఆకట్టకున్నాడు. తొలి క్వాలిఫయర్ రౌండ్‌లో జపాన్ క్రీడాకారుడు తత్సుమా ఎల్టోపై గెలవగా, రెండో రౌండ్‌లో కెనడాకు చెందిన పీటర్ పోలంస్కీను ఓడించాడు. ఈ వీరిద్దర్నీ ఓడించే క్రమంలో ఒక్కో సెట్ టై బ్రేక్ దారి తీసినా సుమీత్ మాత్రం పట్టువదలకుండా పోరాడి విజయం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment