సుమిత్‌ నగాల్‌ సంచలనం.. అత్యుత్తమ ర్యాంకు | Indian Tennis Star Sumit Nagal Attains Career High ATP Ranking Of 71 | Sakshi
Sakshi News home page

సుమిత్‌ నగాల్‌ సంచలనం.. అత్యుత్తమ ర్యాంకు

Published Mon, Jun 17 2024 5:49 PM

Indian Tennis Star Sumit Nagal Attains Career High ATP Ranking Of 71

భారత టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు అందుకున్నాడు. తాజాగా ప్రకటించిన ఏటీపీ మెన్స్‌ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో 71వ స్థానంలో నిలిచాడు.

గత వారంలో కెరీర్‌ బెస్ట్‌ 77వ ర్యాంకు సాధించిన సుమిత్‌.. తాజాగా ఆరు స్థానాలు ఎగబాకి సత్తా చాటాడు. పెరూగియా ఓపెన్‌ ఏటీపీ –125 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచి.. మొత్తంగా 777 ఏటీపీ పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా హర్యానాకు చెందిన 26 ఏళ్ల సుమిత్‌ నగాల్‌... ఇప్పటికే సింగిల్స్‌ విభాగంలో భారత్‌ నుంచి ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. 

ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెనర్‌లో రెండో రౌండ్‌కు అర్హత సాధించిన చరిత్ర సృష్టించిన సుమిత్‌ నగాల్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.

ఇదిలా ఉంటే.. భారత నంబర్‌ వన్‌గా ఉన్న సుమిత్‌ నగాల్‌.. ఇటీవల హీల్‌బ్రాన్‌ నెకార్‌కప్‌-2024 మెన్స్‌ సింగిల్‌ టైటిల్‌ గెలిచాడు. ఆ తర్వాత చెన్నై ఓపెన్‌లోనూ విజయం సాధించాడు. ఈ క్రమంలో ఇలా కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు చేరుకున్నాడు.

చదవండి: T20 WC: రిటైర్మెంట్‌ ప్రకటించిన వెటరన్‌ క్రికెటర్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement