మోజెల్లి ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ కథ తొలి రౌండ్‌లోనే ముగిసింది. ప్రపంచ 66వ ర్యాంకర్ కొరెన్‌టిన్ ముటెట్ (ఫ్రాన్స్)తో ఫ్రాన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తొలి సెట్‌ను 5–7తో కోల్పోయి, రెండో సెట్‌లో 0–4తోవెనుకబడ్డాడు.
ఈ దశలో సుమిత్‌కు గాయం కావడంతో మ్యాచ్ నుంచి వైదొలిగాడు.సుమిత్‌కు 6,215 యూరోలు (రూ. 5 లక్షల 70 వేలు) ప్రైజ్‌మనీగా దక్కాయి. సుమిత్ ఆడిన గత పది టోర్నీలలో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment