
Sumit Nagal: హెల్సింకి ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 69వ ర్యాంకర్ ఎమిల్ రుసువోరి (ఫిన్‌లాండ్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 169వ ర్యాంకర్ సుమిత్ నెగ్గాడు.
తొలి సెట్‌ను 6–3తో నెగ్గి, రెండో సెట్‌లో 3–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో ఎమిల్ గాయంతో వైదొలిగాడు. దాంతో సుమిత్‌ను విజేతగా ప్రకటించారు.
రన్నరప్ నైశిక్ రెడ్డి జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య జూనియర్ సర్క్యూట్ టోరీ్నలో తెలంగాణకు చెందిన గనగామ నైశిక్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. ఢాకాలో జరిగిన ఈ టోరీ్నలో నైశిక్ రెడ్డి–ప్రబీర్ ముకేశ్ చావ్డా (భారత్) ద్వయం బాలుర డబుల్స్ విభాగం ఫైనల్లో ఓటమి చవిచూసింది. తుది పోరులో నైశిక్–ప్రబీర్ జోడీ 2–6, 3–6తో భారత్‌కే చెందిన తవీశ్ పావా–అర్ణవ్ యాదవ్ జంట చేతిలో ఓటమి పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment