పోరాడి ఓడిన సుమిత్‌ నగాల్‌ | Sumit Nagal fought and lost | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన సుమిత్‌ నగాల్‌

Published Thu, Mar 7 2024 12:29 AM | Last Updated on Thu, Mar 7 2024 12:29 AM

Sumit Nagal fought and lost - Sakshi

ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నిలో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌లో సుమిత్‌ 6–2, 2–6, 6–7 (4/7)తో సియోంగ్‌చన్‌ హాంగ్‌ (కొరియా) చేతిలో ఓడిపోయాడు.

2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక టైబ్రేక్‌లో సుమిత్‌ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. సుమిత్‌కు 14,400 డాలర్ల (రూ. 11 లక్షల 93 వేలు) ప్రైజ్‌మనీ, 10 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement