Indian Wells ATP Masters Tournament
-
అల్కరాజ్కు చుక్కెదురు
కాలిఫోర్నియా: ‘హ్యాట్రిక్’ సాధించాలనే లక్ష్యంతో ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్కు నిరాశ ఎదురైంది. గత రెండేళ్లు చాంపియన్‌గా నిలిచిన అల్కరాజ్ ఈసారి సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 14వ ర్యాంకర్, బ్రిటన్ ప్లేయర్ జేక్ డ్రేపర్ అద్భుత ఆటతీరుతో అల్కరాజ్ ఆట కట్టించి తన కెరీర్లో తొలిసారి మాస్టర్స్ సిరీస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో 13వ సీడ్ డ్రేపర్ 6–1, 0–6, 6–4తో రెండో సీడ్ అల్కరాజ్ను బోల్తా కొట్టించాడు. ఈ విజయంతో సోమవారం విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో డ్రేపర్ తొలిసారి టాప్–10లోకి దూసుకురానున్నాడు. 23 ఏళ్ల డ్రేపర్ గత ఏడాది వియన్నా ఓపెన్, స్టుట్గార్ట్ ఓపెన్లలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో 12వ సీడ్ హోల్గర్ రూనే (డెన్మార్క్)తో డ్రేపర్ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ రూనే 7–5, 6–4తో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. అల్కరాజ్తో ఐదోసారి తలపడ్డ డ్రేపర్ ఈసారి పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 1 గంట 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో డ్రేపర్ నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు అల్కరాజ్ 30 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. -
పోరాడి ఓడిన యూకీ జోడీ
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం 6–7 (5/7), 6–3, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫెర్నాండో రాంబోలి (బ్రెజిల్)–జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–గొరాన్సన్ ఏడు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. యూకీ–గొరాన్సన్‌లకు 65 వేల డాలర్ల (రూ. 56 లక్షల 67 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. కెరీర్లో తొలిసారి మాస్టర్స్ సిరీస్ టోర్నీలో ఆడిన యూకీ తాజా ప్రదర్శనతో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 37వ ర్యాంక్‌కు చేరుకుంటాడు. -
రెండో సీడ్ జోడీకి యూకీ బాంబ్రీ ద్వయం షాక్
కాలిఫోర్నియా: తన కెరీర్లో ఆడుతున్న తొలి మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ జోరు కొనసాగుతోంది. ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ–గొరాన్సన్ జంట 6–2, 5–7, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్, ప్రపంచ మూడో, నాలుగో ర్యాంకుల్లో ఉన్న హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్లాండ్)లను బోల్తా కొట్టించింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–గొరాన్సన్ ఒక ఏస్ సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. వాస్తవానికి ఈ టోర్నీలో తమ ర్యాంకింగ్ ప్రకారం యూకీ–గొరాన్సన్‌లకు క్వాలిఫయింగ్‌తోపాటు మెయిన్ ‘డ్రా’లోనూ చోటు దక్కలేదు. అయితే మెయిన్ ‘డ్రా’లో ఉన్న మార్కోస్ గిరోన్–లెర్నర్ టియెన్ (అమెరికా) చివరి నిమిషంలో వైదొలగడంతో ‘రిజర్వ్’ పూల్‌లో ఉన్న యూకీ–గొరాన్సన్‌లకు ఈ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. క్వార్టర్ ఫైనల్ చేరడంతో యూకీ బాంబ్రీ –గొరాన్సన్‌లకు 65 వేల డాలర్ల (రూ. 56 లక్షల 67 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు ఖరారయ్యాయి. -
జొకోవిచ్‌కు చుక్కెదురు
కాలిఫోర్నియా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స్ టోర్నమెంట్లో చుక్కెదురైంది. 24 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ జొకోవిచ్... ఈ టోర్నీలో రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ జొకోవిచ్ 2–6, 6–3, 1–6తో ‘లక్కీ లూజర్’ బొటిక్ వాన్ డి జాండ్‌షుల్ఫ్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. వాస్తవానికి జాండ్‌షుల్ప్ క్వాలిఫయింగ్ దశలోనే ఓడిపోయాడు. అయితే మెయిన్ ‘డ్రా’లో ఒక ప్లేయర్ వైదొలడగంతో క్వాలిఫయింగ్‌లో ఓడిపోయిన మెరుగైన ర్యాంకర్ జాండ్షుల్ప్కు ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. తొలి రౌండ్లో ‘బై’ దక్కించుకున్న జొకోవిచ్... బరిలోకి దిగిన తొలి పోరులోనే నిష్క్రమించాడు. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్... ఈసారి అదే జోరు కనబర్చలేకపోయాడు. 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్లోనే జొకో 14 అనవసర తప్పిదాలకు పాల్పడడంతో తిరిగి కోలుకోలేకపోయాడు.జాండ్‌షుల్ఫ్ బేస్‌లైన్‌తో పాటు నెట్ గేమ్‌తో అదరగొడితే... జొకో మ్యాచ్ ఆద్యాంతం తడబడ్డాడు. ఓవరాల్‌గా జాండ్‌షుల్ఫ్ 4 ఏస్‌లు సంధించగా... జొకో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నెదర్లాండ్స్ ప్లేయర్ 4 డబుల్ ఫాల్ట్స్ చేయగా... జొకోవిచ్ 3 డబుల్ ఫాల్ట్‌లకు పాల్పడ్డాడు. ‘గత కొంతకాలంగా పరిస్థితులు భిన్నంగా సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నా. ఈ పోరాటం సవాలుతో కూడుకున్నది.మధ్యమధ్యలో ఒకటీ రెండు టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబర్చగలుగుతున్నా... దాన్ని కొనసాగించడం ముఖ్యం. పేలవ ప్రదర్శనకు సాకులు వెతకాలనుకోవడం లేదు. ఇది నా రోజు కాదు. మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని జొకోవిచ్ అన్నాడు. ఈ ఏడాది 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకునేలా కనిపించిన జొకోవిచ్... కండరాల నొప్పితో ఆ్రస్టేలియా ఓపెన్ సెమీఫైనల్ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన దోహా టోర్నీ తొలి రౌండ్లోనే జొకో పరాజయం పాలయ్యాడు. మరోవైపు అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఆరంభ దశలోనే విజయాలు సాధించడాన్ని అలవాటుగా మార్చుకున్న జాండ్‌షుల్ఫ్ గతంలో... డేవిస్ కప్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై, యూఎస్ ఓపెన్‌లో అల్కరాజ్ (స్పెయిన్)పై కూడా విజయాలు సాధించాడు. ఇప్పుడు మరో సంచలన నమోదు చేస్తూ జొకోవిచ్పై గెలుపొందాడు. ఓవరాల్‌గా టాప్–10 ప్రత్యర్థులపై జాండ్షుల్ఫ్కు ఇది 8వ విజయం కావడం విశేషం. కాగా, ఈ టోర్నీలో టాప్‌సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నిలో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు. కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో సుమిత్ 6–2, 2–6, 6–7 (4/7)తో సియోంగ్చన్ హాంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక టైబ్రేక్‌లో సుమిత్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. సుమిత్‌కు 14,400 డాలర్ల (రూ. 11 లక్షల 93 వేలు) ప్రైజ్‌మనీ, 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
దిగజారిన నాదల్.. 18 ఏళ్లలో ఇదే తొలిసారి
స్పెయిన్ బుల్.. టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ 18 ఏళ్ల తర్వాత టాప్-10 ర్యాంకింగ్స్ నుంచి దిగువకు పడిపోయాడు. గాయం కారణంగా జనవరి నుంచి ఆటకు దూరంగా ఉన్న నాదల్ క్రమేపీ ర్యాంకింగ్స్‌లో దిగజారుతూ వచ్చాడు. తాజాగా ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీ ముగిసిన తర్వాత విడుదల చేసిన పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నాదల్ 13వ స్థానంలో నిలిచాడు. కాగా 2005లో తొలిసారి టెన్నిస్‌లో టాప్-10లోకి ఎంటర్ అయిన నాదల్ అప్పటినుంచి 18 ఏళ్ల పాటు టాప్-10లోనే కొనసాగాడు. ఒక రకంగా ఇన్నేళ్లపాటు టాప్-10లో కొనసాగడం కూడా నాదల్కు రికార్డే. గతంలో 209 వారాల పాటు నెంబర్‌వన్‌గా ఉండి చరిత్ర సృష్టించిన నాదల్ ఐదుసార్లు నెంబర్‌వన్ ర్యాంక్‌తో ఏడాదిని ముగించాడు. నాదల్ తర్వాత జిమ్మీ కానర్స్ 15 ఏళ్ల పాటు టాప్-10లో కొనసాగాడు. ప్రస్తుతం నాదల్, జొకోవిచ్‌తో కలిసి 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సంయుక్తంగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో వెనుదిరిగిన నాదల్ అనంతరం తుంటి గాయం బారిన పడ్డాడు. గాయం నుంచి నుంచి కోలుకున్న నాదల్ వచ్చే నెలలో జరగనున్న మాంటే కార్లో టెన్నిస్ టోర్నమెంట్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ టోర్నీలో నాదల్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 11సార్లు మాంటే కార్లో టైటిల్ నెగ్గిన నాదల్ ఓపెన్ శకంలో 2005 నుంచి 2012 వరకు వరుసగా ఎనిమిది సార్లు టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. ఇక ఇండియన్ వెల్స్ టోర్నీలో విజేతగా నిలిచిన స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా అవతరించాడు.ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6–3, 6–2తో ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందాడు. ఈ టోర్నీకి ముందు సెర్బియా స్టార్ జొకోవిచ్ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. కోవిడ్ టీకా వేసుకోని విదేశీయులకు అమెరికాలో ప్రవేశం లేకపోవడంతో జొకోవిచ్ ఈ టోరీ్నకి దూరం కావాల్సి వచ్చింది. 7,160 పాయింట్లతో జొకోవిచ్ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. సోమవారం మొదలైన మయామి ఓపెన్ టోర్నీలోనూ అల్కరాజ్ విజేతగా నిలిస్తేనే నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటాడు. లేదంటే ఏప్రిల్ 3న విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ మళ్లీ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంటాడు. చదవండి: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎంతవరకు విజయవంతం? And there it is: After an incredible streak of 934 weeks--falling just a single month short of 18 years--Rafael Nadal has slipped outside the top 10, which he first entered on April 25, 2005. pic.twitter.com/RllZXnNwT1 — Ben Rothenberg (@BenRothenberg) March 20, 2023 -
Indian Wells Masters: బోపన్న కొత్త చరిత్ర...
కాలిఫోర్నియా: నాలుగు పదుల వయసు దాటినా తనలో సత్తా తగ్గలేదని భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మరోసారి నిరూపించుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–3, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ వెస్టీ కూల్‌హాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీని ఓడించింది. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. డానియల్ నెస్టర్ (కెనడా) పేరిట ఉన్న రికార్డును బోపన్న బద్దలు కొట్టాడు. 2015లో నెస్టర్ 42 ఏళ్ల వయసులో సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం తొమ్మిది ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. విజేతగా నిలిచిన బోపన్న–ఎబ్డెన్ జోడీకి 4,36,730 డాలర్ల (రూ. 3 కోట్ల 60 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ వెస్లీ కూల్‌హాఫ్–నీల్ స్కప్సీ జంటకు 2,31,660 డాలర్ల (రూ. 1 కోటీ 91 లక్షలు) ప్రైజ్‌మనీ, 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 5: బోపన్న కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. గతంలో అతను మోంటెకార్లో (2017 లో), మాడ్రిడ్ (2015లో), పారిస్ ఓపెన్ (2012, 2011లో) మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ సాధించాడు. మరో ఐదు మాస్టర్స్ సిరీస్ టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు. 24: బోపన్న కెరీర్లో ఇది 24వ డబుల్స్ టైటిల్. ఈ ఏడాది రెండోది. ఈ సీజన్లో ఎబ్డెన్తోనే కలిసి బోపన్న దోహా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఇండియన్ వెల్స్ టోర్నీకి టెన్నిస్ స్వర్గధామం అని పేరు ఉంది. ఎన్నో ఏళ్లుగా నేను ఈ టోర్నీలో ఆడుతున్నాను. విజేతలెందరినో చూశాను. ఈసారి నేను చాంపియన్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది. –రోహన్ బోపన్న విన్నర్స్ ట్రోఫీతో బోపన్న–ఎబ్డెన్ జోడీ -
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్లో బోపన్న జోడీ
ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న మూడో టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కాలిఫోర్నియాలో జరుగుతున్న ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 7–6 (8/6), 7–6 (7/2)తో జాన్ ఇస్నెర్–జాక్ సాక్ (అమెరికా) ద్వయంపై గెలుపొందింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్ తమ సరీ్వస్‌లో తొమ్మిదిసార్లు బ్రేక్ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. ఇటీవల దోహా ఓపెన్‌లో బోపన్న–ఎబ్డెన్ జంట టైటిల్ సాధించగా... రోటర్‌డామ్ ఓపెన్‌లో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల బోపన్న ఇప్పటి వరకు కెరీర్లో 55 టోరీ్నల్లో ఫైనల్‌కు చేరగా...23 టోరీ్నల్లో టైటిల్స్ నెగ్గి, 32 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాడు. Matt Ebden and Rohan Bopanna are through to the @BNPPARIBASOPEN men's doubles final 💪 This is @mattebden's first ATP Masters 1000 final 👏#GoAussies #TennisParadisehttps://t.co/mpsSu4K0tT — TennisAustralia (@TennisAustralia) March 18, 2023 -
సోమ్‌దేవ్ ఓటమి
ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి రౌండ్లో సోమ్‌దేవ్ 2-6, 7-5, 3-6తో డానియల్ మునోజ్ లా నవా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో ప్రపంచ 287వ ర్యాంకర్ మునోజ్‌ను ఓడిచించిన ప్రపంచ 78వ ర్యాంకర్ సోమ్‌దేవ్ ఈ టోర్నీలో మాత్రం నిరాశపరిచాడు.