భారత నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు సుమీత్ నగాల్ వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నాడు. తాను పారిస్ ఒలింపిక్స్‌కు అధికారికంగా అర్హత సాధించినట్లు నగాల్ స్వయంగా వెల్లడించాడు. ‘2024 పారిస్ ఒలింపిక్స్‌కు నేను అర్హత సాధించాననే విషయాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది.
నా మనసులో ఒలింపిక్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి ఇది చెప్పుకోదగ్గ క్షణం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం నా కెరీర్ విశేషాల్లో చెప్పుకోదగ్గ అంశం. ఆ తర్వాతినుంచి పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా శ్రమించాను. మెగా ఈవెంట్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నా’ అని నగాల్ ట్వీట్ చేశాడు. గత ఏడాది కాలంగా మంచి ఫామ్‌తో వరుస విజయాలు సాధించిన నగాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 71వ స్థానానికి ఎగబాకాడు.
రెండు చాలెంజర్ టైటిల్స్ గెలవడంతో పాటు ఆ్రస్టేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించి రెండో రౌండ్ వరకు చేరుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న – శ్రీరామ్ బాలాజీ జోడి భారత్ తరఫున బరిలోకి దిగనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో బోపన్న ప్రస్తుతం టాప్–10లో ఉండటంతో తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం అతనికి కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment