
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ‘డ్రా’ను గురువారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో బరిలో ఉన్న భారత ప్లేయర్ సుమీత్ నాగల్ తొలి రౌండ్‌లో ప్రపంచ 128వ ర్యాంకర్ బ్రాడ్లీ క్లాన్ (అమెరికా)తో ఆడనున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 122వ స్థానంలో ఉన్న సుమీత్‌కు వరుసగా ఇది రెండో యూఎస్ ఓపెన్. గత ఏడాది ఈ టోర్నీ లో సుమీత్ తొలి రౌండ్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్‌తో తలపడి పోరాడి ఓడిపోయాడు.
నిషికోరి దూరం
మరో మూడు రోజుల్లో యూఎస్ ఓపెన్ మొదలవుతున్న వేళ... టోర్నీలో ఆడలేనంటూ 2014 రన్నరప్ కీ నిషికోరి (జపాన్) ప్రకటించాడు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ నిషికోరి ఇటీవలే కోలుకున్నాడు. దాంతో టోర్నీలో పాల్గొంటాడని అందరూ భావించారు. ఇప్పటికిప్పుడు ఐదు సెట్‌లపాటు జరిగే మ్యాచ్‌ల్లో తాను ఆడలేనని, అందుకే యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు నిషికోరి పేర్కొన్నాడు. సెప్టెంబర్ 27న ఆరంభమయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో అతడు పాల్గొనే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment