
న్యూఢిల్లీ: ప్రాగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 127వ ర్యాంకర్ సుమీత్ నాగల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సుమీత్ నాగల్ 6–3, 5–7, 4–1తో ఆధిక్యంలో ఉన్నదశలో అతని ప్రత్యర్థి జేక్లార్క్ (బ్రిటన్) గాయం కారణంగా తప్పుకున్నాడు. దాంతో సుమీత్‌ను విజేతగా ప్రకటించారు. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సుమీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జిరీ లెహస్కా (చెక్ రిపబ్లిక్)తో తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment