Prague Badminton Open
-
ప్రిక్వార్టర్స్‌లో నాగల్
న్యూఢిల్లీ: ప్రాగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, ప్రపంచ 127వ ర్యాంకర్ సుమీత్ నాగల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సుమీత్ నాగల్ 6–3, 5–7, 4–1తో ఆధిక్యంలో ఉన్నదశలో అతని ప్రత్యర్థి జేక్లార్క్ (బ్రిటన్) గాయం కారణంగా తప్పుకున్నాడు. దాంతో సుమీత్‌ను విజేతగా ప్రకటించారు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన సుమీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జిరీ లెహస్కా (చెక్ రిపబ్లిక్)తో తలపడతాడు. -
విజేత హలెప్
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ఆరు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ప్రాగ్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ హలెప్ 6–2, 7–5తో మూడో సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. ఈ ఏడాది హలెప్ ఖాతాలో చేరిన రెండో టైటిల్ ఇది. ఓవరాల్‌గా ఆమె కెరీర్లో ఇది 21వ సింగిల్స్ టైటిల్. 93 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో హలెప్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. చాంపియన్ హలెప్‌నకు 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 71 వేలు)తోపాటు 280 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
రన్నరప్ సుమీత్ జంట
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): ఈ ఏడాది నిలకడగా రాణిస్తోన్న భారత నంబర్‌వన్ పురుషుల బ్యాడ్మింటన్ జంట సుమీత్ రెడ్డి-మనూ అత్రి త్రుటిలో మరో టైటిల్‌ను కోల్పోయింది. ప్రేగ్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన తన భాగస్వామి మనూ అత్రితో కలిసి రన్నరప్‌గా నిలిచాడు. హోరాహోరీగా జరిగిన పురుషుల డబు ల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 21- 19, 20-22, 14-21తో ఆడమ్ క్వాలినా-ప్రెజ్మీస్లా వచా (పోలండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. రెండో గేమ్‌లో మ్యాచ్ పాయింట్‌ను వదులుకున్న సుమీత్-మనూ అత్రి, నిర్ణాయక మూడో గేమ్‌లో తడబడి మూల్యం చెల్లించుకున్నారు. ఇటీవల లాగోస్ ఓపెన్, బెల్జియం ఇంటర్నేషనల్ ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గిన సుమీత్-మనూ యూఎస్ ఓపెన్‌లో, గ్వాటెమాలా చాలెంజ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచారు.