ముగిసిన రియో ఒలింపిక్స్ .. 67 స్థానంలో భారత్
రియో డి జనీరో: పక్షం రోజుల్లో.. ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్లు, అద్భుతమైన విన్యాసాలకు వేదికగా నిలిచి.. క్రీడాభిమానులకు కన్నుల పండగ చేసిన రియో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. గత 18 రోజులుగా క్రీడాభిమానులను విశేషంగా అలరించిన ఒలింపిక్స్ ఈ రోజుతో ముగిశాయి. ఈ క్రీడా పండగ ముగింపు వేడుకలను రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ వేడుక సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వివిధ ఈవెంట్లలో పాల్గొన్న భారత్ రెండు పతకాలతో 67 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూనైటెడ్ స్టేట్స్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ నుంచి పివి సింధు బ్యాడ్మింటన్ లో రజత పతకం సాధించగా, సాక్షి మాలిక్ రెజ్లింగ్ విభాగంలో కాంస్యం సాధించింది.