పీవీ సింధు, సాక్షిలకు సముచిత గౌరవం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధు, కాంస్యపతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ కు సముచిత గౌరవం దక్కింది. సింధు, సాక్షిలతో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూ రాయ్ లకు అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం నలుగురు క్రీడాకారులకు ఈ అవార్డును ప్రకటించింది. సింధు ఇప్పటికే అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకుంది. రియో ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో దీప నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్ గా ఆమె రికార్డు నెలకొల్పింది. సోమవారం కేంద్ర ప్రభుత్వం అర్జున, ఖేల్ రత్న, ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది.
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానె, అథ్లెట్ లలితా బాబర్, శివ థాపా, అపూర్వి చండీలా సహా మొత్తం 15 మందికి అర్జున అవార్డులను ప్రకటించారు. ఆరుగురుకి ద్రోణాచార్య అవార్డులను ఇవ్వనున్నారు. తెలుగువ్యక్తి నాగపురి రమేష్ కు ఈ అవార్డు దక్కింది.
అవార్డు గ్రహీతలు:
ఖేల్ రత్న: పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్, జీతూ రాయ్
ద్రోణాచార్య: దీపా కోచ్ విశ్వేశ్వర్ నంది, నాగపురి రమేష్ (అథ్లెటిక్స్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్), సాగర్ మల్ ధ్యాయల్ (బాక్సింగ్), రాజ్ కుమార్ శర్మ (క్రికెట్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్)
ధ్యాన్ చంద్ అవార్డు: రాజేంద్ర ప్రహ్లాద్ షెల్కె (రోయింగ్), సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వాన్ ధంగ్ ధంగ్ (హాకీ
అర్జున అవార్డు: రహానె (క్రికెటర్), రజిత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బాబర్ (అథ్లెటిక్స్), శివథాప (బాక్సింగ్), రాణి (హాకీ), విఘ్నేశ్ (రెజ్లింగ్), అమిత్ కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్ మన్ (పారా అథ్లెటిక్స్), సుబ్రతా పాల్ (ఫుట్ బాల్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్), వీరేంద్ర సింగ్ (రెజ్లింగ్-బధిర), వీఆర్ రఘునాథ్ (హాకీ), గురుప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వి చండీలా, సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్)