సాక్షికి టఫ్‌ ఫైట్‌! | Sakshi Malik to face Olympic gold medallist Risako Kawai in final | Sakshi
Sakshi News home page

సాక్షికి టఫ్‌ ఫైట్‌!

Published Fri, May 12 2017 2:32 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

సాక్షికి టఫ్‌ ఫైట్‌!

సాక్షికి టఫ్‌ ఫైట్‌!

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ మరో మెడల్‌ ఖాయం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆమె పతకం సాధించడం ఖాయమైంది. 60 కేజీల విభాగంలో ఆమె ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో కజక్‌స్తాన్‌కు చెందిన అయలిమ్‌ కాసీమోవాను 15-3తో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ జపాన్‌ రెజ్లర్‌ రిసాకొ కావావ్‌తో ఫైనల్లో సాక్షి మలిక్‌ తలపడనుంది. తుది పోరులో గెలిస్తే ఆమెకు బంగారు పతకం వస్తుంది. ఓడితే వెండి పతకం దక్కించుకుంటుంది.

క్వార్టర్‌ ఫైనల్లో ఉజ్బక్‌ రెజ్లర్‌ నబీరా ఎసెన్‌బెవాను 6-2 తేడాతో ఓడించి సెమీస్ చేరింది. గతవారం జరిగిన సెలెక్షన్స్‌లో మంజు కుమారిని 10-0తో ఓడించి ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. 58 కేజీల విభాగంలో ఆమె పోటీ పడాల్సివుంది. అయితే బరువు పెరగడంతో 60 కేజీల విభాగంలో పోటీకి దిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement