సాక్షి మాలిక్ పై కాసుల వర్షం | Financial windfall awaits Oly medallist Sakshi Malik | Sakshi

సాక్షి మాలిక్ పై కాసుల వర్షం

Published Thu, Aug 18 2016 2:53 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

సాక్షి మాలిక్ పై కాసుల వర్షం

సాక్షి మాలిక్ పై కాసుల వర్షం

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పై కాసుల వర్షం కురుస్తోంది. మహిళల ఫ్రీస్టైల్‌ 58 కిలోల రెజ్లింగ్‌ విభాగంలో అద్భుత విజయాలతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న ఆమెకు ఇప్పటివరకు రూ. 3.5 కోట్ల నగదు నజరానాలు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం ఆమెకు రూ. 2.5 కోట్ల నగదుతో పాటు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.

కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక అవార్డు కింద  రూ. 20 లక్షలు ప్రకటించింది. రైల్వేశాఖ రూ.60 లక్షలు ఇవ్వనుంది. భారత ఒలింపిక్ సమాఖ్య తొలిసారిగా కాంస్య పతక విజేతకు రూ.20 లక్షలు బహుమతి ఇవ్వనుంది. వీటితో పాటు రియో ఒలింపిక్స్ కు సౌహార్ద్ర రాయబారిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్  రూ. 1,01,000 అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement