మోదీని కలిసిన సింధు, గోపిచంద్ | pv sindhu, sakshi malik meet pm narendra modi | Sakshi

మోదీని కలిసిన సింధు, గోపిచంద్

Aug 28 2016 5:54 PM | Updated on Aug 15 2018 6:34 PM

మోదీని కలిసిన సింధు, గోపిచంద్ - Sakshi

మోదీని కలిసిన సింధు, గోపిచంద్

పీవీ సింధు, సాక్షి మాలిక్, గోపీచంద్, జిమ్నాస్ట్ దీపా కర్మకార్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్తో పాటు బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, జిమ్నాస్ట్ దీపా కర్మకార్, ఇతర క్రీడాకారులు.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆదివారం ప్రధాని మోదీ అధికార నివాసానికి వీరు వెళ్లారు. మోదీ ఈ సందర్భంగా సింధు, సాక్షి, గోపీచంద్, దీపలను ప్రత్యేకంగా అభినందించారు. సింధు, సాక్షి, దీపలతో ఇటీవల జాతీయ అవార్డులకు ఎంపికైన క్రీడాకారులను మోదీ సత్కరించారు.

రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో తెలుగుతేజం సింధు రజతం, రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. సింధుకు కోచ్గా గోపీచంద్ వ్యవహరించాడు. జిమ్నాస్ట్ దీపా కర్మకార్‌ రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన చేసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement