భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు గత రెండు నెలలగా ఆందోళన చేస్తున్న విషయం విధితమే. అయితే ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రెజర్లు కలిసారు. ఈ క్రమంలో అమిత్ షాను కలిసిన తర్వాత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఈ పోరాటం నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపించాయి.
ఆమె తిరిగి రైల్వేలో తన విధుల్లో చేరనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై సాక్షి మాలిక్ స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలే అని ఆమె కొట్టిపారేసింది.
"ఇవన్నీ రూమర్స్ మాత్రమే. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. మాలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. వెనక్కి తగ్గే ఆలోచన కూడా మాకు లేదు. మేము ఉద్యోగాల్లో చేరనంత మాత్రాన ఈ ఆందోళన నుంచి తప్పుకున్నట్లు కాదు.
మాకు న్యాయం జరిగేంతవరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాము. దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు అని ఆమె ట్విటర్‌లో పేర్కొంది. కాగా స్టార్ రెజర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్ రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ये खबर बिलकुल ग़लत है। इंसाफ़ की लड़ाई में ना हम में से कोई पीछे हटा है, ना हटेगा। सत्याग्रह के साथ साथ रेलवे में अपनी ज़िम्मेदारी को साथ निभा रही हूँ। इंसाफ़ मिलने तक हमारी लड़ाई जारी है। कृपया कोई ग़लत खबर ना चलाई जाए। pic.twitter.com/FWYhnqlinC
— Sakshee Malikkh (@SakshiMalik) June 5, 2023
చదవండి: మనసున్న మారాజు వీరేంద్ర సెహ్వాగ్.. ఒడిశా రైలు ప్రమాద బాధిత పిల్లలకు..!
Comments
Please login to add a commentAdd a comment