Brijbhushan Issue Babita's Reaction to Sakshi Malik Comments - Sakshi
Sakshi News home page

సాక్షి మాలిక్ - బబితా ఫోగట్ మాటల యుద్ధం.. పక్కదారి పడుతోందా? 

Published Sun, Jun 18 2023 4:28 PM | Last Updated on Sun, Jun 18 2023 5:16 PM

Babita Phogat Reaction After Sakshi Malik Sensational Comments

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు చార్జిషీటు నమోదు చేసిన తర్వాత మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, బబితా ఫోగట్ మాటల యుద్ధానికి తెరతీశారు. 

సాక్షి మాలిక్, సత్యవర్త్ కడియాన్.. 
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణల కేసులో ఢిల్లీ పోలీసులు చార్జిషీటు నమోదు చేసిన తర్వాత రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ ఆమె భర్త సత్యవర్త్ కడియాన్ తో కలిసి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో వారు మాట్లాడుతూ.. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు గురై చేసింది కాదు. 

రెజ్లింగ్ సమాఖ్యలో 90 శాతం మందికి 10-12 ఏళ్లుగా ఈ లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలుసు. మాలో ఐక్యత లేకపోయినా కొంతమంది మాత్రం నిరసన తెలపడానికి ముందుకు వచ్చారు. దీక్ష చేయడానికి అనుమతి తీసుకుంది కూడా బీజేపీ నాయకులైన బబితా ఫోగట్, తీరథ్ రాణాలేనని తెలిపారు. అనంతరం ఆ అనుమతి లేఖను కూడా చూపించారు. 

బబితా కౌంటర్.. 
ఈ వీడియోకు కామన్ వెల్త్ బంగారు పతక విజేత బబితా ఫోగట్ ట్విట్టర్లో కాస్త ఘాటుగానే స్పందించింది. ఈ వీడియో చూశాక మిమ్మల్నిద్దరినీ చూసి నాకు కొంచెం బాధగా అనిపించింది. తర్వాత కాసేపు నవ్వుకున్నాను కూడా. ఇలాంటి ఒక విషయాన్ని చెప్పి దాక్కుంటామంటే సరికాదు మిత్రమా. మీరు చూపించిన లేఖలో నా పేరు గానీ నా సంతకం గానీ లేదు. పరోక్షంగా కూడా నా ప్రస్తావన ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. 

నాకు ప్రధానిపైనా, మన న్యాయ వ్యవస్థపైనా నమ్మకముందని నేను మొదటిరోజు నుంచే చెబుతున్నాను. ఒక మహిళగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నా సహచరులపై నాకు కూడా ప్రేమ, పట్టింపులు ఉన్నాయి. అందుకే ఈ విషయాన్ని మొదట ప్రధాన మంత్రి, హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని సూచించాను. కానీ వారు మాత్రం కాంగ్రెస్ లీడర్లు ప్రియాంకా గాంధీ, రేప్ కేసుల్లో నిందితులైన దీపేందర్ హుడాలను ఆశ్రయించారు. 

ఇప్పుడిప్పుడే ప్రజలు మీ అసలు రూపాన్ని చూస్తున్నారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున మీరు చేసిన హడావుడి, గంగానదిలో పతకాలను విసిరేస్తామని చెప్పడం చూస్తుంటే ఇదంతా కాంగ్రెస్ నాయకులు ఆడిస్తున్న ఆటని అందరికీ అర్ధమవుతోందని తెలిపారు.  

దీనికి మళ్ళీ సాక్షి మాలిక్ గట్టిగ కౌంటర్ ఇచ్చింది. సహచరులంతా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే మీరు మాత్రం ప్రభుత్వం ఒడిలో చల్లగా సేదదీరుతున్నారు. మీ స్వప్రయోజనాల కోసం  సహచరులకు ఎటువంటి సాయం చేయకపోగా ఇలా హేళన చేయడం సరికాదని అన్నారు.    

ఇది కూడా చదవండి: రెజ్లర్లకు పోలీసుల నోటీసులు.. వీడియోలు ఫోటోలు ఉన్నాయా?   

     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement