సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి | World Skills 2024: India shines bright with 16 medals in Lyon | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి

Published Tue, Sep 17 2024 6:23 AM | Last Updated on Tue, Sep 17 2024 6:23 AM

World Skills 2024: India shines bright with 16 medals in Lyon

అంతర్జాతీయ వేదికపై పాకశాస్త్రంలో అవార్డు గెలుచుకున్న అశ్విత పోలీస్‌  

వరల్డ్‌ స్కిల్స్‌–2024లో 16 పతకాలతోమెరిసిన భారత్‌

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై పాకశాస్త్రంలో తెలంగాణ అమ్మాయి అశ్విత పోలీస్‌ సత్తా చాటింది. ఫ్రాన్స్‌లోని లియాన్‌లో జరుగుతున్న వరల్డ్‌ స్కిల్స్‌–2024లో అశ్విత బెస్ట్‌ ఆఫ్‌ నేషన్‌ అవార్డును గెలుచుకుంది. భారతదేశం స్కిల్‌ సెట్లలో 4 కాంస్య పతకాలు, 12 మెడలియన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అవార్డులతో కలిపి మొత్తం 16 పతకాలు సొంతం చేసుకుంది. ‘పాటిస్సేరీ–కన్ఫెక్షనరీ’లో అశ్విత పోలీస్, ‘ఇండస్ట్రీ 4.0’లో గుజరాత్‌కు చెందిన ధ్రుమిల్‌కుమార్‌ ధీరేంద్రకుమార్‌ గాంధీ, సత్యజిత్‌ బాలకృష్ణన్, ‘హోటల్‌ రిసెప్షన్‌’లో ఢిల్లీకి చెందిన జోతిర్‌ ఆదిత్య కృష్ణప్రియ రవికుమార్, ‘రెన్యూవబుల్‌ ఎనర్జీ’లో ఒడిశాకు చెందిన అమరేష్‌ కుమార్‌ సాహు కాంస్యపతకాలు గెలుచుకున్నారు. వీటితోపాటు భారతీయ బృందం 12 మెడలియన్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను సంపాదించింది. ‘పాటిస్సేరీ అండ్‌ కన్ఫెక్షనరీ’లో పోటీ చేసిన అశ్విత టీమ్‌ ఇండియా నుంచి అత్యుత్తమ పోటీదారుగా బెస్ట్‌ ఆఫ్‌ నేషన్‌ అవార్డును కూడా గెలుచుకుంది.

అశ్విత చిన్నప్పటి నుంచి స్వీట్స్‌ తయారుచేయడం, టీవీ షోల ద్వారా పాకశాస్త్రంలో నైపుణ్యాన్ని పెంచుకుంది. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ విద్యారి్థని అయిన అశ్విత.. చెఫ్‌ వినేష్‌ జానీ మార్గదర్శకత్వంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. అశ్విత విజయం ప్రపంచ వేదికపై భారతీయ పాకశాస్త్ర ప్రతిభ పెరుగుతున్న ప్రాముఖ్యతను చాటుతోంది. ఈ విజయం దేశవ్యాప్తంగా ఔత్సాహిక చెఫ్‌లను ప్రేరేపిస్తుందని కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌íÙప్‌ మంత్రిత్వ శాఖ కొనియాడింది. పాటిస్సేరీ అండ్‌ కన్ఫెక్షనరీ విభాగంలో 21 దేశాలతో పోటీపడి కాంస్యం సాధించిన అశ్విత పోలీస్‌ మాట్లాడుతూ.. ‘ఈ ప్రయాణం సవాలుతో కూడుకున్నది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం సాధించాలనే కల నిజమైంది. కానీ నమ్మశక్యంగా లేదు’అని అన్నారు. వరల్డ్‌ స్కిల్స్‌ 2024లో 70కి పైగా దేశాల నుంచి 1,400 మందికి పైగా పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. భారత్‌ 52 నైపుణ్య విభాగాల్లో పోటీపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement