
న్యూఢిల్లీ: ఇరాన్‌లో జరుగుతున్న మక్రన్ కప్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. ఇరాన్‌లోని చబహర్ నగరంలో జరిగిన ఈ పోటీల్లో భారత్ ఒక స్వర్ణంతో పాటు ఐదు రజతాల్ని గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ యువ బాక్సర్ పోలేపల్లి లలితా ప్రసాద్ (52 కేజీలు) రజతం సాధించాడు. జాతీయ చాంపియన్ దీపక్ సింగ్ 49 కేజీల కేటగిరీలో బంగారం గెలుపొందాడు. ఫైనల్లో అతను... జాఫర్ నసెరిపై నెగ్గాడు. మరో ఐదుగురు భారత బాక్సర్లు మాత్రం తుదిపోరులో కంగుతిన్నారు. ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ రజత విజేతలైన మనీశ్ కౌషిక్ (60 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), దుర్యోధన్ సింగ్ నెగి (69 కేజీలు), సంజీత్ (91 కేజీలు), లలితా ప్రసాద్ (52 కేజీలు) ఓడిపోవడంతో రజత పతకాలు లభించాయి. ప్రసాద్... ఒమిద్ సఫా అహ్మద్ చేతిలో, దుర్యోధన్... సజ్జద్ జాదే కెజిమ్ చేతిలో, మనీశ్... డానియెల్ షా బ„Š చేతిలో, సతీశ్... మొహమ్మద్ చేతిలో, సంజీత్... ఎల్డిన్ చేతిలో ఓటమి చవిచూశారు. ఇదివరకే ఈ టోర్నీలో రోహిత్ టొకస్ (64 కేజీలు), మన్‌జీత్ సింగ్ (75 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment