సాక్షి, హైదరాబాద్: ఉత్తమ సేవలందించిన పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. నూతన సంవత్సరంగా సందర్భంగా ఇవ్వాల్సిన ఈ పతకాలను దక్కించుకున్న పోలీసు, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల అధికారుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర శౌర్యపతకం, మహోన్నత సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, కఠిన సేవాపతకం, సేవాపతకం.. మొత్తం ఐదు కేటగిరీల్లో పతకాల విజేతల జాబితాను రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ విడుదల చేశారు.
శౌర్య పతకాలు ఎవరికంటే...
పోలీస్‌శాఖ నుంచి శౌర్య పతకాన్ని గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ పి.సతీశ్ దక్కించుకున్నారు. ఇంటెలి జెన్స్ విభాగం(కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, స్టేట్ ఇంటెలిజెన్స్ వింగ్)కు చెందిన ఎస్సై ఎస్‌ఎ కరీం, ఏఎస్సై శివ శంకర్, హెడ్ కానిస్టేబుళ్లు ఎండీ ఖాజా మొయినుద్దీన్, ఎస్.రాజవర్ధన్‌రెడ్డి, ఏ. బాలాజీరావు, కానిస్టేబుళ్లు పి మోహన్, కె కిరణ్‌కుమార్, బి.లక్ష్మీ నారాయణ, బి.వీరస్వామి, ఎండీ అలీముద్దీన్‌లకు తెలంగాణ అగ్నిమాపకశాఖ నుంచి శౌర్య పతకం అందుకున్న వారిలో అసెంబ్లీ ఫైర్ స్టేషన్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వి.ధనుంజయ్‌రెడ్డి, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్‌లో ఎస్‌ఎఫ్‌ఓ( స్టేషన్ ఫైర్ ఆఫీసర్)గా పనిచేస్తున్న డి. మోహన్‌రావు, గౌలిగూడ ఫైర్ స్టేషన్ ఎస్‌ఎఫ్‌ఓ ఎన్ ప్రవీణ్‌కుమార్, మొఘల్‌పుర ఫైర్ స్టేషన్ ఫైర్‌మన్ బి.వెంకటేశ్వర రాజు, గౌలిగూడ ఫైర్‌స్టేషన్ ఫైర్‌మెన్ మహ్మద్ అస్గర్, అసెంబ్లీ ఫైర్‌స్టేషన్ ఫైర్‌మన్ టి. హరికృష్ణ, సికింద్రాబాద్ ఫైర్‌స్టేషన్ ఫైర్‌మన్ ఎం.హరికృష్ణలకు దక్కాయి. పోలీస్ శాఖ నుంచి మహోన్నత సేవా పతకాలు 16 మందికి, ఉత్తమ సేవా పతకాలు 94 మందికి, కఠిన సేవాపతకాలు 51 మందికి, సేవా పతకాలు 473 మందికి దక్కాయి.
ఇల్లెందు ఫైర్‌స్టేషన్ డ్రైవర్‌కుమహోన్నత సేవా పతకం
మహోన్నత సేవా పతకం ఖమ్మం జిల్లా ఇల్లెందు ఫైర్‌స్టేషన్ డ్రైవర్ ఆపరేటర్ కే వెంకటేశ్వర్లుకు దక్కింది. ఉత్తమ సేవా పతకాలు ముగ్గురికి, సేవా పతకాలు 14 మందికి దక్కాయి.
ఏసీబీలో,,,
ఏసీబీలో ఉత్తమ సేవాపతకాలు వరంగల్ రేంజ్ కానిస్టేబుల్ ఏ. నర్సయ్య, నిజామాబాద్ రేంజ్ కానిస్టేబుల్ జి సురేశ్, ఖమ్మం రేంజ్ హెడ్‌కాని స్టేబుల్ టి.క్రిష్ణ సూరిలకు దక్కించుకున్నారు. సేవాపతకాలు 22 మందికి దక్కాయి. విజిలెన్స్ విభాగం నుంచి ఇన్‌స్పెక్టర్ ఎం.హుస్సేని నా యుడు, కానిస్టేబుల్ ఎంఏ మసూద్‌లకు దక్క గా, సేవాపతకాలు ఇన్‌స్పెక్టర్ దండిక మహేశ్, కానిస్టేబుల్ డి.రాజేశ్‌కుమార్ దక్కించుకున్నారు.
ఎస్‌పీఎఫ్‌లో..
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన వారిలో సబ్ ఇన్‌స్పెక్టర్ డి. తిరుపతిరెడ్డికి మహోన్నత సేవా పతకం దక్కింది. ఉత్తమ సేవా పతకాలు ముగ్గురికి, సేవాపతకాలు 15 మందికి దక్కాయి. కాగా, పతకాల జాబితా ఆరు నెలలు ఆలస్యం కావడంపై సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే, ఆలస్యంగానైనా పతకాలు దక్కినందుకు ఒకింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment