సహనం, ప్రేమ స్త్రీమూర్తి సహజ లక్షణాలు. అవే ఆమెను విజయ తీరాలకు నడిపించే వాహనాలు కూడాను. విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉండే పోలీస్ అధికారి భార్యగా ఆయన మనసెరిగి నడచుకుంటారామె. ఇంటి బాధ్యతను తన భుజంపై వేసుకుని గృహిణిగా కుటుంబాన్ని చక్కదిద్దుకుంటారు. అన్నిటికంటే ప్రధానంగా తల్లిగా కొడుకును అంతర్జాతీయ క్రీడాకారుడిగా తీర్చిదిద్దారు. ఆమే ఐపీఎస్ అధికారి నవీన్‌చంద్ సతీమణి అపర్ణ.
ఉన్నత చదువులు చదువుకున్న అపర్ణ ఉద్యోగం ద్వారా వచ్చే పదవుల కంటే ‘అమ్మ’ స్థానమే తనకు ముఖ్యమని నిర్ణయించుకున్నారు. మానసిక ఎదుగుదల లేని కొడుకు వరుణ్‌చంద్(23)ను ఉన్నతంగా తీర్చిదిద్ది తల్లి పాత్రను సుసంపన్నం చేశారు. బిడ్డ చిన్ననాటి నుంచి మానసిన వికాసం కోసం స్విమ్మిం గ్‌లో శిక్షణ ఇప్పించారు. ఆమె ర(శి)క్షణలో జాతీయ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించి 2015లో కాలిఫోర్నియాలో జరగనున్న పోటీలకు ఎంపికయ్యాడు. అపర్ణ మాట్లాడుతూ.. తన బిడ్డ ఆరోగ్యం బాగుపడితే చాలనుకున్నానని, ఇప్పుడు పతకాలు సాధించి తనను ‘విజేత’ను చేశాడన్నారు.
అమ్మ మాట.. పతకాల బాట..
Published Sat, Mar 8 2014 12:03 AM | Last Updated on Sat, Mar 23 2019 9:28 PM
Advertisement
Advertisement