ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట.. ఇదే తొలి సారి | India Achieves Best-Ever Medal Tally In Asian Games History | Sakshi
Sakshi News home page

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట.. ఇదే తొలి సారి

Published Wed, Oct 4 2023 10:23 AM | Last Updated on Wed, Oct 4 2023 10:34 AM

India Achieve Best-Ever Medal Tally in a Single Edition of Asian Games - Sakshi

చైనా వేదికగా జరగుతున్న ఆసియా క్రీడలు-2023 భారత్‌ హవా కొనసాగుతోంది. తాజాగా భారత్‌ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. కాంపౌండ్‌ మిక్స్‌డ్ టీమ్‌ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ వెన్నం- ఓజాస్ డియోటలే గోల్డ్‌ మెడల్‌ సాధించారు.  ఫైనల్లో కొరియాకు చెందిన సో చేవాన్ ,జూ జేహూన్ జంటను భారత జోడి 159-158 తేడాతో ఓడించింది.

ఇదే తొలిసారి..
ఈ విజయంతో ఈ ఏడాది ఏషియన్‌ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 71 చేరింది. తద్వారా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌ అత్యధిక పతకాలు  సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 2018 ఆసియాక్రీడల్లో 70 పతకాలను ఇండియా సాధించింది.  కాగా ప్రస్తుతం భారత ఖాతాలో 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి.
చదవండి: Asian Games 2023: కాంపౌండ్‌ ఆర్చరీలో భారత్‌కు గోల్డ్‌ మెడల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement