ఏషియన్ గేమ్స్ 2023లో ఇవాళ (అక్టోబర్ 1) భారత్‌కు పతకాల పంట పండింది. ఈ రోజు టీమిండియా ఏకంగా 15 పతకాలు (3 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) సాధించింది. ఏషియన్ గేమ్స్ హిస్టరీలో భారత్ ఒకే రోజు ఇన్ని పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. 2010 గ్వాంగ్‌ఝౌ క్రీడల్లో 14వ రోజు భారత్ సాధించిన 11 పతకాలే ఇవాల్టి వరకు ఓ రోజులో భారత్ సాధించిన అత్యధిక పతకాలుగా ఉన్నాయి. దీని తర్వాత 2014 ఆసియా క్రీడల్లో 8వ రోజు భారత్ 10 పతాకలు సాధించింది. 2018 జకార్తా క్రీడల్లో భారత్ 10వ రోజు 9 పతకాలు సాధించింది. 2010 గ్వాంగ్‌ఝౌ క్రీడల్లో 9వ రోజు భారత్ 9 పతకాలు సాధించింది.
ఇదిలా ఉంటే, ఇవాళే భారత్ పతకాల సంఖ్య కూడా 50 దాటింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 53 పతకాలు ఉన్నాయి. 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్య పతకాలను భారత్ ఇప్పటిదాకా సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. 243 పతకాలతో చైనా (132 గోల్డ్, 72 సిల్వర్, 39 బ్రాంజ్) అగ్రస్థానంలో దూసుకుపోతుంది. 125 పతకాలతో (30, 35, 60) కొరియా రెండో స్థానంలో, 112 పతకాలతో (29, 41, 42) జపాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. కాగా, 2018 క్రీడల్లో గెలిచిన 69 పతాకలే ఇప్పటివరకు భారత్ అత్యధిక పతకాల సంఖ్యగా కొనసాగుతుండగా.. ఈసారి క్రీడల్లో భారత్ ఈ రికార్డును సునాయాసంగా దాటి 100 పతకాల మార్కును తాకుందని అంచనా. ఈ ఎడిషన్‌లో ఇంకా వారం రోజులు మిగిలి ఉన్నాయి.
ఇవాళ భారత్ సాధించిన స్వర్ణ పతకాలు..
- పురుషుల ట్రాప్ టీమ్ షూటింగ్ (కైనన్ డేరియస్, జొరావర్ సింగ్, పృథ్వీరాజ్ తొండైమాన్)
- అవినాశ్ సాబ్లే (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్)
- తజిందర్‌పాల్ సింగ్ తూర్ (మెన్స్ షాట్‌పుట్)
Comments
Please login to add a commentAdd a comment