గణతంత్ర దినోత్సవం సందర్భంగా 766 మందికి గుర్తింపురాష్ట్రంలో 43 మంది పతకాలకు ఎంపిక
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత 65వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మొత్తం 766 మంది సిబ్బందికి కేంద్ర హోంశాఖ పతకాలను ప్రకటించింది. వీటికి రాష్ట్రపతి శనివారం ఆమోదముద్ర వేశారు. నలుగురికి రాష్ట్రపతి పోలీసు శౌర్య పతకం, 44 మందికి పోలీసు శౌర్య పతకం, 94 మందికి రాష్ట్రపతి విశిష్ట పోలీసు సేవాపతకం, 624 మందికి విశిష్ట పోలీసు సేవా పతకాలను ప్రదానం చేయనున్నారు. ఇక సంస్కరణ సేవ (కరెక్షనల్ సర్వీసు)లో మొత్తం 41 మందికి విశిష్ట సేవా పతకాలు లభించాయి. దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ బలగమైన సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి మొత్తం 33 మందికి ఈ పతకాలు లభించగా, వాటిలో 15 పోలీసు శౌర్య పతకాలు ఉన్నాయి. ఇక సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)కు 51 పతకాలు లభించాయి.
మన రాష్ట్రంవారు 43 మంది...
ఈ గణతంత్ర పతకాల విజేతల్లో మన రాష్ట్రానికి చెందినవారు మొత్తం 43 మంది ఉన్నారు. ఐదుగురికి రాష్ట్రపతి విశిష్ట శౌర్య పతకం, 37 మందికి పోలీసు విశిష్ట శౌర్యపతకం లభించగా, ఒకరికి కరెక్షనల్ సర్వీసులో పతకం లభించింది.
ఠ రాష్ట్రపతి విశిష్ట శౌర్య పతకం: జె.పూర్ణచందర్‌రావు, ఏడీజీపీ (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్, హైదరాబాద్), పి.ఉమాపతి, డీఐజీ (వైజాగ్ రేంజ్), టి.యోగానంద్, డీఐజీ (సీఐడీ, హైదరాబాద్), టి.మురళీకృష్ణ, డీఐజీ (కర్నూలు రేంజ్), అనిల్‌కుమార్, ఐజీ (ఎన్‌ఐఎస్‌ఏ, హైదరాబాద్, సీఐఎస్‌ఎఫ్)
ఠ పోలీసు విశిష్ట సేవాపతకం: విక్రంసింగ్ మాన్, డీఐజీ (ఏలూరు రేంజ్), ఎన్.శివశంకర్‌రెడ్డి, ఎస్పీ (తూర్పు గోదావరి), జి.శ్రీనివాస్, ఎస్పీ (ఇంటెలిజెన్స్, హైదరాబాద్), డి.నాగేంద్రకుమార్, ఎస్పీ (మహబూబ్‌నగర్), ఎ.సత్యనారాయణ, జేడీ (ఏసీబీ, హైదరాబాద్), విశ్వనాథ్ రవీందర్, ఎస్పీ (కరీంనగర్), పి.రాజేంద్రప్రసాద్, ఏఎస్పీ (హైదరాబాద్), ఎం.చక్రధర్‌రావు, అదనపు కమాండెంట్ (ఏపీఎస్పీ, 8వ బెటాలియన్, కొండాపుర్), పి.సీతారాం, అదనపు కమాండెంట్ (గ్రేహౌండ్స్, హైదరాబాద్), పి.వెంకట్రామిరెడ్డి, డీఎస్పీ (గుంటూరు రూరల్), ఎం.దయానందరెడ్డి, ఎస్‌డీపీవో (అనంతపురం), కేవీ రాఘవరెడ్డి, డీఎస్పీ (మదనపల్లి), సీహెచ్ భద్రయ్య, డీఎస్పీ (విద్యుత్‌సౌధ, ఖైరతాబాద్), దేవెందర్‌సింగ్, డీఎస్పీ (సీఐ సెల్ ఇంటెలిజెన్స్, హైదరాబాద్), ఎం.మునిరామయ్య, డీఎస్పీ (హైదరాబాద్ రూరల్), బి.రామకృష్ణ, అసిస్టెంట్ కమాండెంట్ (గ్రేహౌండ్స్, హైదరాబాద్), పి.వీరాంజనేయరెడ్డి, ఇన్‌స్పెక్టర్ (సీసీఎస్, నెల్లూరు), షేక్ బురాన్ షరీఫ్, ఎస్సై, ఇ.మనోహర్, ఎస్సై (కల్యానిధం, తిరుపతి), ఎం.మంతయ్య, ఎస్సై (సైబరాబాద్), బి.వెంకటరామిరెడ్డి, కమాండెంట్ (సికింద్రాబాద్), సి.హనుమంతరెడ్డి, ఏఎస్సై (ఎస్‌వోటీ, సైబరాబాద్), ఎన్.శివకుమార్, ఏఆర్ ఎస్సై (ఏపీఎస్పీ, వరంగల్), ఎం.శ్రీనివాసరావు, ఏఆర్ ఎస్సై (విజయవాడ), గణేష్ ప్రసాద్, ఎస్సై (ఇంటెలిజన్స్, హైదరాబాద్)
ఎం.ఇక్బాల్ హుస్సేన్, హెడ్‌కానిస్టేబుల్ (విజయవాడ), రావు బొడ్డేడ శంకర్, ఇన్‌స్పెక్టర్ (ఏసీబీ, హైదరాబాద్), మంగళ్ లక్రా, కమాండెంట్ (సీఐఎస్‌ఎఫ్, ఖమ్మం జిల్లా), శాంత్ రక్సిత్, అసిస్టెంట్ కమాండెంట్ (జాతీయ పోలీసు అకాడమీ, హైదరాబాద్), పీవీ వర్గీస్, ఎస్సై ఎగ్జిక్యూటివ్ (సీఐఎస్‌ఎఫ్, వైజాగ్), టి.సెల్వరాజు, హెడ్‌కానిస్టేబుల్ (సీఐఎస్‌ఎఫ్, వైజాగ్), ఎ.మనోహరన్, హెడ్‌కానిస్టేబుల్, జీడీ (సీఐఎస్‌ఎఫ్, హైదరాబాద్), గోపీచంద్, హెడ్‌కానిస్టేబుల్, ఎన్‌ఐఎస్‌ఏ (సీఐఎస్‌ఎఫ్, హైదరాబాద్), సీహెచ్ సత్యసింహ వెంకటరమణ, డీసీఐవో (హోం వ్యవహారాల శాఖ, హైదరాబాద్), రణ్‌ధీర్‌సింగ్, ఇన్‌స్పెక్టర్, జాతీయ పోలీసు అకాడమీ (హైదరాబాద్), ఆదిత్యనారాయణ సింగ్, హెడ్‌కానిస్టేబుల్, జాతీయ పోలీసు అకాడమీ (హైదరాబాద్), పి.సత్యనారాయణ, ఏఎస్సై (ఆర్‌పీఎస్‌ఎఫ్, సికింద్రాబాద్ రైల్వేస్).
కరెక్షనల్ సర్వీసులో విశిష్ట సేవా పతకం: గడ్డం ప్రసాదరావు, హెడ్‌వార్డర్, సబ్‌జైలు (గిద్దలూరు).