పతకాల కోసం పతాకాలతో ర్యాలీ | raly for reyo medals | Sakshi
Sakshi News home page

పతకాల కోసం పతాకాలతో ర్యాలీ

Published Fri, Aug 5 2016 9:49 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

పతకాల కోసం పతాకాలతో ర్యాలీ

పతకాల కోసం పతాకాలతో ర్యాలీ

 
చిలకలూరిపేటటౌన్‌: విద్యార్థులు ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగేందుకు కృషి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ నామా కనకారావు చెప్పారు. ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రియో ఒలంపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించాలని కోరుతూ శుక్రవారం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు పతాకాలు చేపట్టి భారత్‌ గెలవాలంటూ నినాదాలు చేశారు. ర్యాలీని మున్సిపల్‌ కమిషనర్‌ కనకరావు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రై వేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ స్థానిక శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి చేబ్రోలు మస్తాన్‌రావు, జిల్లా కార్యదర్శి ఈదర గిరీష్‌బాబు, సూదా రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement