
బిష్క్క్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఉదిత్ (57 కేజీలు) రజతం నెగ్గగా... అభిమన్యు (70 కేజీలు), విక్కీ (97 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్లో ఉదిత్ 4–5తో కెంటో యుమియా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. బౌట్ చివరి సెకన్లలో ఉదిత్ ప్రత్యర్థికి ఒక పాయింట్ కోల్పోయాడు.
2020 నుంచి 2023 వరకు ఈ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాలు లభించాయి. రవి కుమార్ దహియా వరుసగా మూడేళ్లు (2020, 2021, 2022)... గత ఏడాది అమన్ ఈ విభాగంలో పసిడి పతకాలు నెగ్గారు. మరోవైపు కాంస్య పతకాల బౌట్‌లలో అభిమన్యు 6–5తో కుల్దాòÙవ్ (ఉజ్బెకిస్తాన్)పై, విక్కీ 10–1తో అరోనోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment