
గోల్డ్‌కోస్ట్, క్వీన్స్‌లాండ్ : 21వ కామన్‌వెల్త్ గేమ్స్ ఆఖరి రోజు భారత్ పతకాల పంట పండింది. 11వ రోజు మహిళల బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ బంగారు పతకం సాధించగా, పీవీ సింధు రజతం సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించారు.
మలేసియా షట్లర్ లీ చోంగ్ వీతో జరిగిన ఫైనల్‌లో శ్రీకాంత్ ఓటమి చవి చూశారు. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో ఇంగ్లండ్‌తో తలపడిన భారత్ వరుస సెట్లలో ఓడిపోయి రజత పతకానికి పరిమితమైంది. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్, ఇంగ్లండ్ ఆటగాడిని వరుస సెట్లలో మట్టికరిపించి భారత్‌కు కాంస్య పతకం అందించారు.
స్క్వాష్ మహిళల డబుల్స్ ఫైనల్‌లో భారత్ స్టార్లు జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్ కార్తీక్‌లు న్యూజిలాండ్ జంట చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో భారత్ రజత పతకానికి పరిమితం కావాల్సివచ్చింది. పసిడి 26, రజతం 20, కాంస్యం 20 కలిపి మొత్తం 66 పతకాలతో భారత్ పట్టికలో మూడో స్థానంలో ఉంది.