
హరికృష్ణ అదుర్స్
యూరోపియన్ క్లబ్ చెస్‌లో స్వర్ణ, రజత పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ అరుదైన ఘనత సాధించాడు. స్పెయిన్‌లోని బిల్బావో నగరంలో జరిగిన యూరోపియన్ క్లబ్ కప్‌లో స్వర్ణ, రజత పతకాలను గెల్చుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఓ భారతీయ క్రీడాకారుడు వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం నెగ్గడం ఇదే తొలిసారి. యూరోప్‌లోని 52 క్లబ్‌ల మధ్య జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణ చెక్ రిపబ్లిక్‌కు చెందిన జీ-టీమ్ నోవీ బోర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మూడో బోర్డుపై బరిలోకి దిగిన హరికృష్ణ ఏడు రౌండ్లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో నోవీ బోర్ రన్నరప్‌గా నిలిచింది.