సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాల పంట పండించారు. తమిళనాడులో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణకు ఏడు పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి.
అండర్–15 బాలుర విభాగంలో వేముల అద్వైత్ విఘ్నేశ్ (7.5 పాయింట్లు)... అండర్–15 బాలికల విభాగంలో యశ్వి జైన్ (7 పాయింట్లు)... అండర్–13 బాలుర విభాగంలో చల్లా సహర్ష (8 పాయింట్లు)... అండర్–11 బాలికల విభాగంలో మోదిపల్లి దీక్షిత (7.5 పాయింట్లు)... అండర్–9 బాలికల విభాగంలో పుంగవనం సంహిత (8 పాయింట్లు) పసిడి పతకాలు గెలిచారు.
అండర్–7 బాలుర విభాగంలో ఆదుళ్ల దివిత్ రెడ్డి (7.5 పాయింట్లు) కాంస్యం, అండర్–7 బాలికల విభాగంలో బోగా వంశిక (7 పాయింట్లు) రజతం సాధించారు. పతకాలు సాధించిన వారికి నెలనెలా భారత గ్రాండ్‌మాస్టర్ ఎం.శ్యామ్‌సుందర్‌తో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment