న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల జాబితాలో మరొకటి అదనంగా చేరింది. నాడు లభించిన రజతమే ఇప్పుడు స్వర్ణంగా మారింది. 4గీ400 మిక్స్‌డ్ రిలే ఈవెంట్లో భారత బృందం రెండో స్థానంలో (3 నిమిషాల 15.71 సెకన్లు) నిలిచింది. బహ్రెయిన్ (3 నిమిషాల 11.89 సెకన్లు) స్వర్ణం సాధించగా, కజకిస్తాన్ టీమ్ (3 నిమిషాల 19.52 సెకన్లు) కాంస్యం సాధించింది. అయితే బహ్రెయిన్ జట్టులో సభ్యుడైన కెమీ అడికోయా డోపింగ్‌లో పట్టుబడ్డాడు. అతనిపై అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ నాలుగేళ్ల నిషేధం విధించింది. ఫలితంగా బహ్రెయిన్‌ను డిస్‌క్వాలిఫై చేస్తూ భారత్‌కు బంగారు పతకాన్ని ప్రకటించారు. ఈ స్వర్ణం గెలుచుకున్న బృందంలో మొహమ్మద్ అనస్, అరోకియా రాజీవ్, హిమ దాస్, పూవమ్మ సభ్యులుగా ఉన్నారు.
మరో కాంస్యం కూడా...
మరో భారత అథ్లెట్ అను రాఘవన్ ఖాతాలో కూడా ఇదే తరహాలో కాంస్య పతకం చేరింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అను 4వ స్థానంలో నిలిచింది. ఈ రేస్ గెలిచిన అడెకోయాపై కూడా నిషేధం పడటంతో అనుకు కాంస్య పతకం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment