
న్యూఢిల్లీ: 2023 సంవత్సారానికి గానూ దేశవ్యాప్తంగా 140 మంది పోలీసు అధికారులు కేంద్ర హోంశాఖ అందించే ఇన్వెస్టిగేషన్‌లో ఎక్సలెన్స్ మెడల్స్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు అవార్డు పొందిన వారి జాబితాను కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటించింది.
ఇక ఈ ఏడాది అవార్డులు అందుకున్న వారిలో సీబీఐ నుంచి 15 మంది, ఎన్‌ఐ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్ నుంచి తొమ్మిది మంది చొప్పున, తమిళనాడు నుంచి 8, మధ్యప్రదేశ్ నుంచి ఏడుగురు, గుజరాత్ నుంచి ఆరుగురితోపాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారు ఉన్నారు. కాగా వీరిలో 22 మంది మహిళా పోలీసులు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి పది మంది పోలీసులకు మెడల్స్ లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అయిదుగురు, తెలంగాణ నుంచి అయిదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్ మెడల్ దక్కాయి.
ఏపీ నుంచి..
► గుంట్రెడ్డి అశోక్ కుమార్, ఇన్‌స్పెక్టర్
►షేక్ మన్సూరుద్దిన్, ఇన్‌స్పెక్టర్
►ధనుంజయుడు మల్లెల, డీఎస్పీ
►కొర్లకుంట సుప్రజ, డీఎస్పీ
►ఉప్పుటూరి రవిచంద్ర, డీఎస్పీ
తెలంగాణ నుంచి..
►మేకల తిరుపతన్న, అడిషనల్ ఎస్పీ
►రాజుల సత్యనారాయణ రాజు, డీఎస్పీ
►మూల జితేందర్ రెడ్డి, ఏసీపీ
►కమ్మాపల్లి మల్లిఖార్జున కిరణ్‌కుమార్, డీఎస్పీ
►భూపతి శ్రీనివాసరావు, ఏసీపీ
కాగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ అందించే ఈ పతకాన్ని 2018లో ఇవ్వడం ప్రారంభించగా.. ప్రతి ఏడాది ఆగస్టు 12వ తేదీనా ప్రకటిస్తారు. నేర పరిశోధనలో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, విచారణలో వారి ప్రతిభను గుర్తించి గుర్తించి ఈ అవార్డు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment