ఒలింపిక్ మెడల్స్ ఎలా తయారుచేస్తున్నారంటే.. | Tokyo 2020 medals to be made from recycled mobile phones | Sakshi
Sakshi News home page

ఒలింపిక్ మెడల్స్ ఎలా తయారుచేస్తున్నారంటే..

Published Thu, Feb 2 2017 12:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

ఒలింపిక్ మెడల్స్ ఎలా తయారుచేస్తున్నారంటే..

ఒలింపిక్ మెడల్స్ ఎలా తయారుచేస్తున్నారంటే..

ఈసారి టోక్యోలో జరుగబోతున్న 2020 ఒలింపిక్స్ నేచర్ ఫ్రెండ్లీగా ఎప్పటికీ అందరి మనస్సులో చిరస్థాయిగా నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు.

వాషింగ్టన్ : ఈసారి టోక్యోలో జరుగబోతున్న  2020 ఒలింపిక్స్ నేచర్ ఫ్రెండ్లీగా ఎప్పటికీ అందరి మనస్సులో చిరస్థాయిగా నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. ఒలింపిక్స్లో విజయ కెరటం ఎగురవేసిన వారికి ఇచ్చే మెడల్స్ను వినూత్న పద్ధతిలో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. పాతబడి వాడుకలో లేకుండా మనం పక్కన పడేసిన మొబైల్ ఫోన్లను రీసైక్లింగ్ చేసి పతకాలను రూపొందించాలని నిర్వాహకులు నిర్ణయించారు. సంప్రదాయంగా  ఒలింపిక్, పారాలింపిక్స్ గేమ్స్లో అందించే పతకాలను బంగారం, వెండి, కాంస్యంతో తయారుచేసేవారు.
 
కానీ ఈ కొత్త డెవలప్మెంట్తో అవసరం, వాడుకలో లేని మొబైల్ ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తమకు అందించాలని జపనీస్ ప్రజలను నిర్వాహకులు కోరుతున్నారు. వాటితో 5000 మెడల్స్ రూపొందిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ నుంచి స్థానిక ఆఫీసులు, టెలికాం స్టోర్ల ద్వారా సేకరిస్తున్న బాక్స్లో ఎనిమిది టన్నుల మెటల్ను సేకరించినట్టు అంచనావేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రీసైక్లింగ్ చేసిన మెటీరియల్స్తో ఒలింపిక్ మెడల్స్ను రూపొందించడం ముందటి క్రీడల్లో కూడా జరిగిందని చెబుతున్నారు. గతేడాది వేసవిలో జరిగిన రియో ఒలింపిక్స్లో 30 శాతం వెండి, కాంస్య పతకాలను రీసైక్లింగ్ మెటీరియల్స్తోనే రూపొందించినట్టు వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement