తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రతిష్టాత్మక పతకాలు ప్రకటించారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ప్రతిష్టాత్మక పతకాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ కేటగిరీలలో మొత్తం 34 మంది పోలీసు అధికారులను ఎంపిక చేశారు. ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీపీఎమ్‌జీ), పోలీస్ మెడల్ గ్యాలంటరీ (పీఎమ్‌జీ), ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ (పీపీఎమ్‌డీఎస్), పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్వీసు (పీఎమ్‌ఎమ్‌ఎస్) లలో పతకాలను ప్రధానం చేయనున్నారు. ఈ నెల 26న 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదానోత్సవం జరగనుంది.
పీపీఎమ్‌డీఎస్: (ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్)
తెలంగాణ నుంచి ముగ్గురు పోలీసు అధికారులు ఎంపికయ్యారు. వారి వివరాలు..
1. అంజనీ కుమార్, అడిషనల్ సీపీ లాండ్ ఆర్డర్, హైదరాబాద్
2. ఎన్. సూర్యనారాయణ, డీఐజీ, హైదరాబాద్
3. ఎమ్. శివ ప్రసాద్, జాయింట్ పోలిస్ కమిషనర్, హైదరాబాద్
పీపీఎమ్‌డీఎస్: (ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్)
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు అధికారులు ఎంపికయ్యారు.
1. కె.ఆర్.ఎమ్ కిషోర్ కుమార్, అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఎడిజీఓపీ), రైల్వే పోలీస్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్
2. జి. రాజకిషోర్ బాబు, ఎస్పీ(ఎన్‌సీ), ఇంటిలిజెన్స్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్
పీపీఎమ్‌జీ: (ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ)
తెలంగాణ నుంచి ఇద్దరు పోలీసు అధికారులు ఎంపికయ్యారు.
1. కోటగిరి శ్రీధర్, ఎస్‌ఐ
2. నలువుల రవీందర్, ఎస్‌ఐ
పీఎమ్‌ఎమ్‌ఎస్: (పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్వీసు)
ఆంధ్రపదేశ్ రాష్ట్రం నుంచి 15 మంది ఎంపికయ్యారు.
1. పొచినేని రమేశయ్య, ఎస్పీ, రీజినల్ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్, నెల్లూరు
2. బి. శ్రీనివాస్, ఎడిషినల్ ఎస్పీ, ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ విభాగం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్
3. ఎస్. రాజశేఖర రావు, అడిషనల్ ఎస్పీ, రీజినల్ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్
4. వి. విజయ భాస్కర్, డిప్యూటీ ఎస్పీ, ఇంటిలిజెన్స్, హైదరాబాద్
5. నున్నబొడి సత్యనాదం, డిప్యూటీ ఎస్పీ, రీజినల్ ఆఫీస్, సీఐడీ, విజయవాడ సిటీ
6. చింతాడ లక్ష్మీపతి, డిప్యూటీ ఎస్పీ, అవినీతి నిరోదక శాఖ, విజయనగరం
7. ఎన్ సుబ్బారావు, డిప్యూటీ ఎస్పీ, అనంతపురం జిల్లా
8. కింజరపు ప్రభాకర్, ఏసీపీ, ట్రాఫిక్, విశాఖపట్నం
9. రాజాపు రమణ, ఏసీపీ, తూర్పు సబ్ డివిజన్, విశాఖపట్నం
10. సుధాబాతుల రమేశ్ బాబు, ఎస్‌ఐ, పశ్చిమగోదావరి జిల్లా
11. షేక్ షఫీ అహ్మద్, ఎస్‌ఐ, జిల్లా స్పెషల్ బ్రాంచ్, నెల్లూరు జిల్లా
12. బి. లక్ష్మయ్య, ఆర్మ్‌డ్ రిజర్వు ఎస్‌ఐ, పోలీస్ ట్రైనింగ్ కాలేజీ, తిరుపతి
13. సుబ్బసాని రంగారెడ్డి, హెడ్ కానిస్టేబుల్, 6వ బిన్ ఏపీ స్టేట్ పోలీస్, మంగళగిరి, గుంటూరు జిల్లా
14. అగ్రహారం శ్రీనివాస శర్మ, హెడ్ కానిస్టేబుల్, కడప, టూ టౌన్ పోలీస్ స్టేషన్
15. జె. నాగేశ్వరరావు, ఆర్మ్‌డ్ రిజర్వు హెడ్ కానిస్టేబుల్, సీఏఆర్, విజయవాడ
పీఎమ్‌ఎమ్‌ఎస్: (పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్వీసు)
తెలంగాణ రాష్ట్రం నుంచి 12 మంది ఎంపికయ్యారు.
1. ఎమ్. స్టిఫెన్ రవీంద్ర, డీఐజీ, గ్రేహౌండ్స్, అడిషినల్ డిజీపీ హైదరాబాద్, తెలంగాణ
2. పళ్ల రవీందర్ రెడ్డి, అడిషినల్, ఎస్పీ (అడ్మిన్), మెదక్, సంగారెడ్డి
3. ఎమ్. భీమ్ రావు, డీప్యూటీ ఎస్పీ, కరీంనగర్
4. కొట్టం శ్యాం సుందర్, డీస్పీ, స్పెషల్ ఇన్విస్టిగేషన్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ పోలీస్, హైదరాబాద్, టి.ఎస్-5
5. కటకం మురళీధర్, డీస్పీ, సీఐ సెల్ హైదరాబాద్
6. కొమ్మెర శ్రీనివాసరావు, ఎస్పీ, స్పెషల్ ఇన్విస్టిగేషన్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ హైదరాబాద్, టి.ఎస్
7. పోలు రవీందర్, ఎస్‌ఐ, జిల్లా స్పెషల్ బ్రాంచ్, నిజామాబాద్, తెలంగాణ
8. వై. వల్లీబాబా, ఎస్‌ఐ, జీడీకే-2(టీ), కరీంనగర్
9. నెతికార్ మూర్తిరావు, ఎస్‌ఐ, సౌత్ ఈస్ట్ సెల్, హైదరాబాద్
10. మహమ్మద్ జాఫర్, రిజర్వు ఎస్‌ఐ, సీఐ సెల్ హైదరాబాద్, తెలంగాణ
11. దబ్బికార్ కిసాంజె, రిజర్వు ఎస్‌ఐ, సీఐ సెల్, హైదరాబాద్, తెలంగాణ
12. ఎ. వెంకటేశ్వర రెడ్డి, రిజర్వు ఎస్‌ఐ, మహబూబ్‌నగర్, తెలంగాణ