సత్తా చాటిన గచ్చిబౌలి కేవీ అథ్లెట్లు | gachibowli Kendriya Vidyalaya students prove medals | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన గచ్చిబౌలి కేవీ అథ్లెట్లు

Published Sat, Nov 2 2013 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

gachibowli Kendriya Vidyalaya students prove medals

రాయదుర్గం, న్యూస్‌లైన్: జాతీయ స్పోర్ట్స్ మీట్‌లో సత్తా చాటి పతకాలు సాధించిన గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయ క్రీడాకారులను సన్మానించారు. గత నెల 19 నుంచి 23 వరకు గౌహతిలో బాలికలకు, 24 నుంచి 28 వరకు చండీగఢ్, చెన్నైలో బాలుర పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తలపడిన కేవీ ఆటగాళ్లు వివిధ విభాగాల్లో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
 
 విజేతలు అక్షయ, నూతన్ (తైక్వాండో), ఎస్.శుభం (అథ్లెట్), నమ్రత చంద్ర (బ్యాడ్మింటన్), ఆశిష్ (చెస్), కావ్య శ్రేయ (స్విమ్మింగ్), జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లోని కేంద్రీయ విద్యాలయలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వీణయ్య, పీఈటీ విజయభాస్కర్‌రెడ్డి, కోచ్ రాంబాబు, సత్యమహేశ్, అరుణ్‌లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement