service medals
-
26 మందికి శౌర్య, సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 మంది శౌర్య, సేవా పతకాలకు ఎంపికయ్యారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్‌కు చెందిన మొత్తం 1,037 మంది అధికారులకు శౌర్య, సేవా పోలీస్ పతకాలను ప్రకటించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురికి పోలీస్ శౌర్య పతకాలు, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 19 మందికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకాలు లభించాయి. అగ్నిమాపక సర్వీస్‌కు చెందిన ఒకరికి ప్రతిభాపూర్వక పోలీస్ పతకం వరించింది. ప్రాణాలు, ఆస్తులను కాపాడటం, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్తులను అరెస్ట్ చేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం (పీఎంజీ), శౌర్య పతకం (జీఎం) కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం (పీఎస్ఎం), విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం (ఎంఎస్ఎం) ఇస్తున్నారు. రాష్ట్రం నుంచి పతకాలకు ఎంపికైన వారి వివరాలివీ.ప్రతిభాపూర్వక సేవా పతకాలువిష్ణు నర్ణిది (అడిషనల్ ఎస్పీ), లక్ష్మీ ఎన్ఎస్జే (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్), గోపాలకృష్ణ సోమసాని (డీఎస్పీ), మురళీకృష్ణ తక్కెలపాటి (డీఎస్పీ), రామచంద్రమూర్తి కొండుమహంతి (అడిషనల్ ఎస్పీ), ఉదయభాస్కర్ దేశబత్తిన (గ్రూప్ కమాండర్), శ్రీనివాసులు పేదరాశి (డీఎస్పీ), కృష్ణమూర్తిరాజు కనుమూరి (ఇన్స్పెక్టర్), లక్ష్మీ నరసింహారావు సిరికి (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), రమేష్‌బాబు కాట్రగడ్డ (కానిస్టేబుల్), శ్రీనివాసరావు గడ్డం (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), వీరవెంకట సత్యసాంబశివరావు తోటకూర (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), వెంకట సుబ్బారాయుడు జింకా (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), రామచంద్ర శేఖరరావు మంద (హెడ్ కానిస్టేబుల్), జయచంద్రరెడ్డి వద్దిరెడ్డి హెడ్ కానిస్టేబుల్), డి.భక్తవత్సలరాజు (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), చిన్న సైదా షేక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), కె.గోవిందరాజులు (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), షరీఫ్ మహబూబ్ (సబ్ ఇన్స్పెక్టర్), చిన్నం మార్టిన్ లూథర్‌కింగ్ (అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్)రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు» ఎం.రవిప్రకాష్ (ఐజీ)» డి.డి.గంగరాజు (ఇన్స్పెక్టర్) శౌర్య పతకాలు» షేక్ సర్దార్ ఘనీ (ఇన్స్పెక్టర్)» సవ్వన అరుణ్‌కుమార్ (సబ్ ఇన్స్పెక్టర్)» మైలపల్లి వెంకట రామ పరదేశీనాయుడు (రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్)» రాజన గౌరీశంకర్ (హెడ్ కానిస్టేబుల్) -
రాష్ట్రానికి 2 రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, సివిల్ డిఫెన్స్ సేవల్లోని మొత్తం 1,132 మంది అధికారులకు కేంద్రప్రభుత్వం నాలుగు కేటగి రీల్లో పతకాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు 2 రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 12 మంది పోలీసులకు ప్రతిభా సేవాపతకాలు, ఇద్దరు జైలు అధికారులకు ప్రతిభా సేవా పతకాలు, ఆరుగురికి మెడల్ ఫర్ గ్యాలెంట్రీ లభించాయి. అడిషనల్ డీజీపీలు దేవేంద్ర సింగ్ చౌహాన్, సౌమ్యా మిశ్రాకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు దక్కాయి. మెడల్ ఫర్ గ్యాలెంట్రీ వీరికే వాడిచెర్ల శ్రీనివాస్, నలివేణి హరీశ్, గడ్డిపోగుల అంజయ్య, బూర్క సునీల్ కుమార్, ఎండీ.అయూబ్, పి.సతీష్‌లు గ్యాలెంట్రీ పతకాలకు ఎంపికయ్యారు. ప్రతిభా సేవా పతకాలు వీరికి డీఐజీ జాకబ్ పరిమళ హన నూతన్, ఏఎస్పీ డి.చంద్రయ్య, 8వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ కొక్కు వీరయ్య, కమాండెంట్ నరుకుళ్ల త్రినాథ్, ఎస్పీ నూకల వెంకటేశ్వర్లు, ఏసీపీ పింగిళి నరేష్ రెడ్డి, ఏసీపీ శ్రీరాముల మోహన్ కుమార్, ఎస్ఐ బెల్లం జయచంద్ర, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ ఎనుముల వెంకట్‌రెడ్డి, అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐ గండిపూ డి ఏసుపాదం, హెడ్ కానిస్టేబుల్ జంగయ్య, ఎస్ఐ మంచిరేవుల సురేందర్ రెడ్డికు పోలీసు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. తెలంగాణకు చెందిన ఇద్దరు.. కరెక్షనల్ సర్వీసు కేటగిరీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ అర్కోట్ శ్రీధర్, జైలర్ యాదరి రమణయ్య ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. మొత్తం 1,133 పతకాలు: కాగా ఈఏడాది ప్రకటించిన మొత్తం 1,132 పతకాల్లో బీఎస్ఎఫ్కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులకు రాష్ట్రపతి శౌర్య పతకాలు వారి మరణానంతరం లభించాయి. మిగతా 275 మందికి శౌర్యపతకాలు, 102 మందికి రాష్ట్ర పతి విశిష్ఠ సేవా పతకాలు, 753 మందికి ప్రతిభా సేవా పతకాలను గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. గ్యాలెంట్రీ పతకా లు దక్కించుకున్న 275 మందిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 72 మంది, ఛత్తీస్‌గఢ్ నుంచి 26, ఝార్ఖండ్ నుంచి 23, మహారాష్ట్ర నుంచి 18 మంది పోలీసులు ఉన్నారు. సీ ఆర్పీఎఫ్ నుంచి 65, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మంది శౌర్య పతకాలకు ఎంపికయ్యారు. ఏపీకి చెందిన 9మంది అధికారులకు ప్రతిభా సేవా పతకాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తొమ్మిదిమంది పోలీసు అధికారులకు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. కమాండెంట్ కోటనాని వెంకట ప్రేమ్‌జిత్, ఆర్ఎస్ఐ ఆవుల చెన్నయ్య, ఏఎస్ఐ ఆర్.రమణారెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అద్దంకి, ఏఎస్ఐ బి.ప్రకాశ్‌రావు, ఏఎస్ఐ కరి మస్తాన్రావ్, అసిస్టెంట్ కమాండెంట్ పుల్లభొట్ల వెంకట సత్య అనంత దుర్గ ప్రసాద్ రావు, ఇన్స్పెక్టర్ అక్కిశెట్టి శ్రీహరి రావు, డీఎస్పీ కోటిరెడ్డి పోలీసు ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పెనికలపాటి వెంకట రమణ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జాస్తి రమణయ్య, లీడింగ్ ఫైర్‌మ్యాన్ షేక్ ఘనీలకు ఫైర్ సర్వీసెస్ కేటగిరీలో ప్రతిభా సేవా పతకాలు దక్కాయి. చౌహాన్‌కు డబుల్ ధమాకా రాష్ట్రపతి మెడల్‌తో పాటు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్ పోలీస్ అధికారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌కు ఒకేసారి రెండు అవార్డులు లభించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కేంద్రం ప్రకటించే రాష్ట్రపతి మెడల్‌కు డీఎస్ చౌహాన్ ఎంపికయ్యారు. దీంతోపాటు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు(2024) కూడా ఆయనకు లభించింది. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా 2023 శాసన సభ ఎన్నికలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించినందుకుగానూ ఎన్నికల సంఘం ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును గురువారం జేఎన్టీయూలో జరిగిన ఓటర్స్డే సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేతులమీదుగా డీఎస్ చౌహాన్ అందుకున్నారు. ఒకే రోజు రెండు అవార్డులు రావడం పట్ల పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఆయ నకు అభినందనలు తెలిపారు. సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యం అయిందని ఈ సందర్భంగా డీఎస్ చౌహాన్ వ్యాఖ్యానించారు. -
300 మంది పోలీసులకు సేవా పతకాలు
హైదరాబాద్ : ఉగాది పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగంలో ఉత్తమ సేవలందించిన వారికి ఏటా ఇచ్చే పతకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ ఏడాది అన్ని విభాగాల్లోనూ కలిపి 300 మంది పోలీసులకు వివిధ పతకాలు దక్కాయి. గుంటూరు రూరల్ జిల్లాల్లో పనిచేస్తున్న ఆర్ఎస్ఐ పోతుల నర్సింహారావు, కానిస్టేబుల్ షేక్ సైదు నాసర్ (పీసీ-439), గ్రేహౌండ్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఎం.రాజేష్ (ఎస్సీ-5704), ఎన్.రామాంజనేయులు (జేస్సీ-7271), పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎర్రవరపు వెంకటేశ్వరరావు (పీసీ-1393)లకు విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ముఖ్యమంత్రి శౌర్యపతకాలు లభించాయి. ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ షేక్ హుస్సేన్ సాహెబ్, స్పోర్ట్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న కె.సూర్యభాస్కర్‌రెడ్డి, నెల్లూరు సీసీఎస్ ఎస్.ఐ. షేక్ షరీఫ్‌లకు రాష్ట్ర పోలీసు మహోన్నత సేవాపతకం లభించింది. వీటితోపాటు పోలీసు విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న 37 మందికి ఉత్తమ సేవ, 30 మందికి కఠిన సేవ, 160 మందికి పోలీసు సేవాపతకాలు లభించాయి. మరోవైపు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పనిచేస్తున్న ముగ్గురికి ఉత్తమ సేవ, 13 మందికి పోలీసు సేవాపతకాలు లభించాయి. అగ్నిమాపక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురికి ఉత్తమ సేవ, 25 మందికి సేవాపతకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురికి ఉత్తమ సేవ, పది మందికి పోలీసు సేవాపతకాలు లభించాయి. అవినీతి నిరోధక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారికి ఉత్తమ సేవ, ఆరుగురికి సేవ, అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ముగ్గురికి ఉత్తమ సేవ, పది మందికి సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆయా అధికారులకు ఈ పతకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేస్తారు.