స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఒకరోజు సెలవు.. స్కూల్‌లో చాక్లెట్లు.. వాట్సప్‌లో స్టేటస్‌లు అనుకుంటున్నారేమో. ఇంట్లో విభిన్న మనస్తత్వాలున్న కుటుంబ సభ్యులను ఒప్పించి మనకు ఇష్టమైన పని చేయాలంటే ఎంత కష్టమో తెలుసుకదా. అలాంటిది మన ఊరు..పట్టణం..జిల్లా..రాష్ట్రం..దేశంలోని కోట్ల ప్రజలను ఏకధాటిపైకి తీసుకొచ్చి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఎందరో మహానుభావులకు వందనాలు. వారి కష్టఫలానికి గుర్తుగా కొందరు వ్యక్తులు బాగా చదివి వ్యాపారంలో రాణించి ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తున్నారు. భారత్ పేరును ప్రపంచానికి చాటుతున్నారు. అందులో కొందరి గురించి తెలుసుకుందాం. 78వ స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా..
ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ కలిగిన వారికి భారత్ నెలవుగా మారింది. దాంతో గ్లోబల్‌గా ఆధిపత్యం చలాయిస్తున్న కంపెనీలు భారతీయులను నియమించుకుంటున్నాయి. ఎంట్రీ లెవల్, మేనేజర్ స్థాయి ఉద్యోగులుగా వెళ్లినవారు కంపెనీల్లో టాప్ స్థాయికి చేరి ఏకంగా సీఈఓలు, ఛైర్మన్‌లుగా ఎదుగుతున్నారు.
అల్ఫాబెట్ ఇంక్, గూగుల్ సీఈవో, సుందర్‌పిచాయ్
సుందర్‌పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్.
తమిళనాడులోని అశోక్ నగర్‌లో 1972 జులై 12న జన్మించారు.
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో మెటలార్జికల్ ఇంజినీరింగ్ విభాగంగా బీటెక్ చేశారు.
1993లో అమెరికా వెళ్లిన సుందర్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.
గూగుల్‌లో చేరడానికి ముందు మెకిన్సే, అప్లైడ్ మెటీరియల్స్ సంస్థల్లో పనిచేశారు.
2004లో గూగుల్ సంస్థలో ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు.
గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు.
2015లో గూగుల్ సీఈఓగా నియమితులయ్యారు.
నాలుగేళ్లకే 2019లో గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.
సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్
హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల కర్ణాటకలోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు.
అతడి తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్, 1962 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి.
సత్య విస్కాన్సిన్ మిల్వాకీ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు.
సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు.
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ గ్రూప్‌కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
ఆన్‌లైన్ సర్వీసెస్ విభాగానికి ఆర్ అండ్ డీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, మైక్రోసాఫ్ట్ బిజినెస్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్ తర్వాత కంపెనీ చరిత్రలో మూడో సీఈఓగా 4 ఫిబ్రవరి 2014న నియమితులయ్యారు.
శాంతను నారాయణ్, అడోబ్ ఇంక్ ఛైర్మన్, సీఈవో
హైదరాబాద్‌లో 1963లో జన్మించారు.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
1998లో అడోబ్‌లో వరల్డ్‌వైడ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు.
2001 నుంచి 2005 వరకు అడోబ్ ప్రపంచవ్యాప్త ఉత్పత్తులకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
2005లో ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
నవంబర్ 2007లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.
అజయ్‌పాల్ సింగ్ బంగా, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్
అజయ్ బంగా 1959 నవంబరు 10న మహారాష్ట్ర పుణెలోని ఖడ్కీ కంటోన్మెంట్‌లో ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు.
ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా ఆర్మీ అధికారి.
అజయ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు.
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) నుంచి మేనేజ్‌మెంట్‌లో పీజీపీ(ఎంబీఏతో సమానం) పూర్తి చేశారు.
భారత ప్రభుత్వం 2016లో బంగాకు పద్మశ్రీ అందించింది.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా 2023 మే 3న ఎన్నికయ్యారు.
గీతా గోపీనాథ్, డిప్యూటీ ఎండీ ఐఎంఎఫ్
గీతా గోపీనాథ్ 1971లో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పుట్టారు.
2022లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు.
2019-2022 వరకు ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు.
ఐఎంఎఫ్‌లో చేరడానికి ముందు, గోపీనాథ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్ర విభాగంలో విద్యావేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించారు.
అరవింద్ కృష్ణ, ఐబీఎం ఛైర్మన్, సీఈవో
అరవింద్ కృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1962లో జన్మించారు.
ఆయన తండ్రి మేజర్ జనరల్ వినోద్ కృష్ణ భారత సైన్యంలో ఆర్మీ అధికారిగా చేశారు.
అరవింద్ 1985లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు.
1990లో ఐబీఎంలో చేరారు.
ఏప్రిల్ 2020 నుంచి కంపెనీ సీఈవోగా, తర్వాత జనవరి 2021లో ఛైర్మన్‌గా బాధ్యలను స్వీకరించారు.
ఇంద్రా నూయి, పెప్సికో సీఈఓ
ఇంద్రా అక్టోబర్ 28, 1955న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు.
1975లో మద్రాస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోల్‌కతా నుంచి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ డిప్లొమా పూర్తి చేశారు.
జాన్సన్ & జాన్సన్, బార్డ్‌సెల్ లిమిటెడ్‌లో ప్రొడక్ట్ మేనేజర్ హోదాలతో తన కెరీర్‌ను ప్రారంభించారు.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)లో స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా చేరారు.
మోటొరోలాలో వైస్ ప్రెసిడెంట్, కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
1994లో పెప్సికోలో చేరారు. 2006లో సీఈఓగా నియమితులయ్యారు.
ఇదీ చదవండి: ముంబయి-ఢిల్లీ టికెట్ కంటే తులం బంగారం చీప్!
రేవతి అద్వైతి, ఫ్లెక్స్ సీఈఓ
అద్వైతి 1990లో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
2005లో థండర్‌బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ నుండి MBA సంపాదించారు.
2019లో ఫ్లెక్స్‌లో చేరడానికి ముందు ఈటన్, హనీవెల్‌లో నాయకత్వ స్థానాల్లో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment