భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. పెళ్లిళ్లు, పండగలు, పుట్టినరోజు, పెళ్లి రోజు..ఇలా ప్రత్యేక దినాల్లో మరింత స్పెషల్‌గా ఆత్మీయులకు ఆనందాన్ని పంచేందుకు బంగారాన్ని కొంటూంటారు. అంతేకాదు గోల్డ్‌ను స్థిరంగా వృద్ధి చెందే సురక్షితమైన పెట్టుబడిగా భావించి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. చైనా తర్వాత బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ పసిడి ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...
1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది.
1947లో రూ.88.62 రెట్టింపు అయింది.
1947లో ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లే టికెట్ ధర కంటే 10 గ్రాముల బంగారం ధర తక్కువ.
స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.
1950-60 దశాబ్దంలో బంగారం దాదాపు 12 శాతం ఎగిసింది.
1970లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.184కు చేరింది.
1980లో రూ.1,330కు, 1990 నాటికి రూ.3,200 దాటింది.
2001 ఏడాదికి సుమారు 15శాతం చొప్పున పెరిగింది.
2008-2009లో ఆర్థిక సంక్షోభం మార్కెట్లను కుదిపేసినప్పటికీ 2000-2010 మధ్య కాలంలో బంగారం ధర రూ 4,400 నుంచి రూ.18,500 వరకు పెరిగింది.
2021లో సగటు బంగారం ధర 10 గ్రాములకు రూ.48,720.
2023లో రూ.60వేల వద్ద రికార్డు స్థాయిని బ్రేక్ చేసింది.
2024 మేలో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా గరిష్ఠంగా రూ.76,450ను తాకింది. ప్రస్తుతం ఈరోజు(ఆగస్టు 14, 2024) రూ.71,150గా ఉంది.
బంగారం ధరను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..
గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర ప్రభావం
భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు
ఆర్థికమాంద్యం భయాలు
ఆర్థిక, రాజకీయ పరిస్థితులు
ప్రభుత్వ విధానాలు
డాలర్ విలువ
ద్రవ్యోల్బణం
భారత్ దిగుమతి చేసుకునే బంగారంలో దాదాపు 44 శాతం స్విట్జర్‌ల్యాండ్ నుంచే వస్తోంది. తర్వాత యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి సుమారు 11 శాతం పసిడి దిగుమతి అవుతుంది. తర్వాత స్థానంలో సౌత్ ఆఫ్రికా, గినియా ఉంటాయి.
ఇదీ చదవండి: పెరుగుతున్న సౌర విద్యుత్ సామర్థ్యం
ఎక్కువ కొనుగోలు చేసేది ఎప్పుడంటే..
పెళ్లిళ్లు
పుట్టినరోజు
పెళ్లిరోజు
దీపావళి
ఆక్షయ తృతియ
దంతేరాస్
ఇతర ప్రత్యేక రోజులు, పండగలు
Comments
Please login to add a commentAdd a comment