![Akan Aahvaanam: A Unique Fundraising Fest On Independence Day 2024](/styles/webp/s3/article_images/2024/08/13/akan.jpg.webp?itok=Ig4M78WG)
హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్ట్ 15) సందర్భంగా అకాన్ రెస్టారెంట్ ప్రత్యేకమైన ఫండ్ రైజింగ్ విందును ఏర్పాటు చేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. నిరుపేదల శిశువులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ ప్రత్యేక విందులో పాల్గొనాలని ఆహ్వానించింది. ఇక్కడ మధ్యాహ్నం అందించే పసందైన భోజనంతో పాటు.. చెఫ్‌లు, కళాకారులు ఒక మరపురాని అనుభూతిని అందిస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన ప్రతి రూపాయి.. ఎన్‌ఐసీయూ యూనిట్లలో నిరుపేద కుటుంబాలకు చెందిన నెలలు నిండని శిశువులకు మద్దతు ఇవ్వడానికి ఎక్స్‌ట్రామైల్ ఫౌండేషన్‌కు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు రుచికరమైన భోజనంతో పాటు, ఆహ్లాదకరమైన సితార్ ప్రదర్శన ఏర్పాటు చేసి అద్భుతమై అనుభవాన్ని అందిస్తాం.
ఈవెంట్స్ వివరాలు..
అగ్రశ్రేణి చెఫ్‌లు రూపొందించిన మాస్టర్‌పీస్ వంటలో పాల్లొని ప్రత్యేకమైన డైనింగ్ అనుభవం పొందండి
లైవ్ సితార్ ప్రదర్శనలో పాల్గొని సంగీతాన్ని ఎంజాయ్ చేయండి.
ఇక్కడికి వచ్చిన వారు తమకు నచ్చిన విధంగా నిధులు చెల్లించవచ్చు.
నెలలు నిండని శిశువుల జీవితాల్లో మార్పు తీసుకురావటం కోసం ఓ గొప్ప సహాయక కార్యక్రమానికి మద్దతు ఇవ్వవచ్చు.
వెరైటీ వంటకాలు రుచి చూడాలని, ఆనందంగా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి, సామాజిక బాధ్యత కలిగి ఉన్నవారంతా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాతో చేరండి.
వివరాలు..
తేదీ: స్వాతంత్ర దినోత్సవం( ఆగస్ట్ 15)
సమయం: 12-4 PM
వేదిక: అకాన్, హైదరాబాద్
మరింత సమాచారం, రిజర్వేషన్ల కోసం సంప్రదించండి: 9649652222
https://akanhyd.com/aahvaanam/
Comments
Please login to add a commentAdd a comment