
నేడు (పంద్రాగస్టు)దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. వారణాసిలో కొలువైన విశ్వేశ్వరుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలాడు.
శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్‌తో పాటు జై భారత్ మాతాకీ అంటూ నినాదాలు చేశారు. తెల్లవారు జామునే త్రివర్ణాలతో అలంకృతుడైన మహాశివుణ్ణి చూసి భక్తులు ఉప్పొంగిపోయారు.
तिरंगे के रंग में बाबा विश्वनाथ का श्रृंगार किया गया. भारत माता की जय के नारों से गूंजा बाबा का दरबार. #IndependenceDayIndia pic.twitter.com/eisPF0alJi
— Prashant rai (@prashantrai280) August 15, 2024