sivudu
-
Independence Day: త్రివర్ణ అలంకరణలో కాశీ విశ్వేశ్వరుడు
నేడు (పంద్రాగస్టు)దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. వారణాసిలో కొలువైన విశ్వేశ్వరుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలాడు.శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్‌తో పాటు జై భారత్ మాతాకీ అంటూ నినాదాలు చేశారు. తెల్లవారు జామునే త్రివర్ణాలతో అలంకృతుడైన మహాశివుణ్ణి చూసి భక్తులు ఉప్పొంగిపోయారు. तिरंगे के रंग में बाबा विश्वनाथ का श्रृंगार किया गया. भारत माता की जय के नारों से गूंजा बाबा का दरबार. #IndependenceDayIndia pic.twitter.com/eisPF0alJi— Prashant rai (@prashantrai280) August 15, 2024 -
చూసొద్దాం.. రండి
హిందూపురం నుంచి గౌరిబిదనూరుకు వెళ్లేదారిలో తొలి స్టేజ్‌లోనే బసవన్నపల్లి గ్రామం వస్తుంది. ఇక్కడ సుమారు 200 అడుగుల ఎత్తున ఉన్న భారీ శివుడి రూపాన్ని చూడవచ్చు. రోడ్డు పక్కనే ఉన్న ఈ ఆలయంలో నీలపు ఛాయతో తపోదీక్షలో ఉన్న శివుడి విగ్రహాన్ని చూడగాన్నే భక్తిభావంతో మనసు పరవశించిపోతుంది. ఈ విగ్రహం ఎదుట భారీ రూపంలో ఉన్న నంది, చుట్టూ వివిధ ఆకృతుల్లో ఉన్న వందలాది శివలింగాలు ఉంటాయి. నిత్యపూజలతో శోభాయమానంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి పండుగకూ ఇక్కడ విశేష పూజలు ఉంటాయి. ఇక మహా శివరాత్రి నాడు చెప్పనలవి కాదు. కార్తీక మాసంలో వేకువ జాము, సాయంత్రం వేళల్లో దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటుంటారు. ఆ మాసంలో జరిగే లక్ష దీపార్చన చూసేందుకు రెండు కనులు చాలవు. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 123 కిలోమీటర్లు ప్రయాణించి హిందూపురం మీదుగా మరో ఐదు కిలోమీటర్లు గౌరిబదనూరు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. - హిందూపురం అర్బన్ -
పాలమూరులో యువకుడి ఆకలిచావు
కొల్లాపూర్: ఆకలికి తట్టుకోలేక ఓ యువకుడు మరణించాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం వాసి శివుడు (26)ది నిరుపేద కుటుంబం. హైదరాబాద్‌కు వలస వెళ్లిన అతడి తల్లి కొన్నాళ్ల క్రితం మరణించడంతో భార్యతో కలసి ఇంటికి వచ్చాడు. కూలి పనులు దొరకకపోవడంతో ఆ కుటుంబం పస్తులతోనే గడుపుతోంది. తిండిలేక బాగా నీరసించిన శివుడు బుధవారం మరణించాడు.