చూసొద్దాం.. రండి | summer special | Sakshi
Sakshi News home page

చూసొద్దాం.. రండి

Published Sun, Apr 30 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

చూసొద్దాం.. రండి

చూసొద్దాం.. రండి

హిందూపురం నుంచి గౌరిబిదనూరుకు వెళ్లేదారిలో తొలి స్టేజ్‌లోనే బసవన్నపల్లి గ్రామం వస్తుంది. ఇక్కడ సుమారు 200 అడుగుల ఎత్తున ఉన్న భారీ శివుడి రూపాన్ని చూడవచ్చు. రోడ్డు పక్కనే ఉన్న ఈ ఆలయంలో నీలపు ఛాయతో తపోదీక్షలో ఉన్న శివుడి విగ్రహాన్ని చూడగాన్నే భక్తిభావంతో మనసు పరవశించిపోతుంది. ఈ విగ్రహం ఎదుట భారీ రూపంలో ఉన్న నంది, చుట్టూ వివిధ ఆకృతుల్లో ఉన్న వందలాది శివలింగాలు ఉంటాయి.

నిత్యపూజలతో శోభాయమానంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి పండుగకూ ఇక్కడ విశేష పూజలు ఉంటాయి. ఇక మహా శివరాత్రి నాడు చెప్పనలవి కాదు. కార్తీక మాసంలో వేకువ జాము, సాయంత్రం వేళల్లో దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటుంటారు. ఆ మాసంలో జరిగే లక్ష దీపార్చన చూసేందుకు రెండు కనులు చాలవు. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 123 కిలోమీటర్లు ప్రయాణించి హిందూపురం మీదుగా మరో ఐదు కిలోమీటర్లు గౌరిబదనూరు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.
- హిందూపురం అర్బన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement