దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పలు నగరాలు అందంగా ముస్తాబయ్యాయి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఈ నేపధ్యంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఒక అద్భుతమైన వీడియో షేర్ చేశారు. త్రివర్ఱాలతో వెలిగిపోతున్న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో షేర్ చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విమానాశ్రయాన్ని ఎలా అలంకరించారో ఈ వీడియోలో చూడవచ్చు. విమానాశ్రయం అంతా త్రివర్ణ పతాకాలతో మెరిసిపోతోంది. టెర్మినల్ వెలుపల, లాబీ, లైట్ హౌస్ మొదలైనవన్నీ వెలుగులమయంగా మారాయి.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గౌతమ్ అదానీ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో.. ‘మన విమానాశ్రయ టెర్మినల్స్ త్రివర్ణాలతో సగర్వంగా నిలబడి ఉన్నాయి. ఇవి కేవలం తలుపులు మాత్రమే కాదు.. మన దేశ ప్రగతికి ప్రతీకలు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా నిలుస్తామని చెప్పేందుకు, ఉజ్వల భవిష్యత్తుపై ఆశతో కొనసాగేందుకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి’ అని పేర్కొన్నారు.
విమానాశ్రయంలో పలు స్తంభాలను ఎంత వైభవంగా అలంకరించారో గౌతమ్ అదానీ షేర్ చేసిన వీడియోలలో చూడవచ్చు. ఢిల్లీ తర్వాత దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ముంబై విమానాశ్రయం. ప్రయాణీకులకు అందించే సౌకర్యాల పరంగా ఈ విమానాశ్రయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.
As our nation celebrates 77 years of freedom, our airport terminals stand tall, wrapped in the proud Tricolour! Far more than just gateways, they symbolise our nation's soaring spirit, resilience and the optimism for a brighter future. @CSMIA_Official pic.twitter.com/66g0DqGYdD
— Gautam Adani (@gautam_adani) August 14, 2024
Comments
Please login to add a commentAdd a comment