
సాక్షి, గుంటూరు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2024
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారు.

Comments
Please login to add a commentAdd a comment