భారతదేశ 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై తివర్ణ పతకాన్ని ఎగరవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించిన ప్రసంగించారు. అందులో భాగంగా ప్రస్తుత ప్రభుత్వ కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. గతంలో బ్యాంకింగ్ రంగం సవాళ్లు ఎదుర్కొన్నా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ప్రపంచంలోని కొన్ని సమర్థమైన బ్యాంకుల్లో భారతీయ బ్యాంకులున్నాయన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న భారతీయ బ్యాంకులు బలంగా మారాయి. గతంలో బ్యాంకింగ్ రంగం పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి. వృద్ధి లేదు, విస్తరణ లేదు, విశ్వాసం లేదు. ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు సంస్కరణలు తీసుకొచ్చింది. నేడు ఆ సంస్కరణల కారణంగా బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని సమర్థమైన బ్యాంకుల్లో భారతీయ బ్యాంకులు ఉన్నాయి. మధ్యతరగతి, రైతులు, గృహ కొనుగోలుదారులు, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈ రంగాల అవసరాలను తీర్చడానికి బ్యాంకింగ్ వ్యవస్థ కీలకంగా మారింది’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సుప్రీం కోర్టు తీర్పు.. రూ.2 లక్షల కోట్లు నష్టం
Comments
Please login to add a commentAdd a comment