భారత్‌ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ | India celebrates 78th Independence Day today, PM Narendra Modi to address from Red Fort | Sakshi
Sakshi News home page

భారత్‌ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ

Published Thu, Aug 15 2024 7:21 AM | Last Updated on Thu, Aug 15 2024 11:43 AM

India celebrates 78th Independence Day today, PM Narendra Modi to address from Red Fort

ఎర్రకోటపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ

నెహ్రూ తర్వాత వరుసగా 11వ సారి ఎర్రకోటపై జెండాను ఎగురవేసిన మోదీ

స్వాతంత్య్ర దినోత్సోవ వేడుకలకు ఆరువేల మందికి ఆహ్వానం

ఈ ఏడాది థీమ్‌.. వికసిత్‌ భారత్‌ @ 2047

న్యూఢిల్లీ :  భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సోవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.

దేశంలో సెక్యులర్‌ సివిల్‌ కోడ్‌ అవసరమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రజలందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలన్ని ప్రధాని.. దేశ అభివృద్ధి కోసం వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ అవసరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  మూడు నెలలకు ఓసారి ఎన్నికలు వస్తున్నాయని, దీనివల్ల అభివృద్ధికి, వనరులకు విఘాతం కలుగుతుందన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ.  

2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చాలని ప్రజలకు సూచించారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమన్నారు ప్రధాని మోదీ.  మహిళలపై నేరాలను అరికట్టేందుకు సమాజమంతా బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబాలను నుంచి లక్షల మంది రావాలన్నారు. ఏ పార్టీ నుంచి అయినా వారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికన పక్షంలో కొత్త ఆలోచనలు, కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చినట్లు అవుతుందన్నారు. తద్వారా వారసత్వ రాజకీయాలు, కుల, మత రాజకీయాలకు అడ్డుకట్టపడుతుందన్నారు. 
 

ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

👉భారత్‌ ప్రస్థానం ప్రపంచానికి స్పూర్తిదాయకం 

👉అంతరిక్ష రంగంలో భారత్‌ బలమైన శక్తిగా ఎదిగింది

👉భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు భారత్‌ సంకల్పం తీసుకుంది

👉దేశాభివృద్ధికి భారీ ప్రణాళికలు అవసరం

👉వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనేది ప్రభుత్వ నినాదం

👉వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనే నినాదం దేశ ఆర్ధిక వ్యవ్యస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది

👉దేశాభివృద్ధికి భారీ ప్రణాళికలు అవసరం

👉సర్జికల్‌ స్ట్రైక్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారు

👉తయారీ రంగంలో భారత్‌ గ్లోబుల్‌ హబ్‌గా మారాలి

👉భారత్‌ తర్వలోనే ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది

👉మౌలిక సదుపాయాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చాం.  

 

👉విదేశాలకు వెళ్లి చదివే దుస్థితిని తగ్గిస్తాం

👉మెడికల్‌ సీట్ల సంఖ్యను భారీగా పెంచబోతున్నాం

👉మెడిసిన్‌ చదివేందుకు యువత విదేశాలకు వెళ్తోంది

👉దేశంలో అత్యాచారం ఘటనలను తీవ్రంగా ఖండిస్తాం

👉నిందితులకు కఠిన శిక్ష పడిన సందర్భాలకు ప్రచారం జరిగితే నేరస్తుల్లో భయం పుడుతుంది

👉మెడికల్‌ సీట్ల సంఖ్యను భారీగా పెంచబోతున్నాం

👉మెడిసిన్‌ చదివేందుకు యువత విదేశాలకు వెళ్తోంది

👉నిందితులకు కఠిన శిక్ష పడిన సందర్భాలకు ప్రచారం జరిగితే నేరస్తుల్లో భయం పుడుతుంది

 

👉దోషులను అంత కఠినంగా శిక్షిస్తే అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు 

👉దేశంలో ఎక్కడ అత్యాచారాలు జరిగినా మీడియా హైలెట్‌ చేస్తోంది

👉మాతృభాషను ఎవరు విస్మరించొద్దు

👉ఉపాధి కల్పనలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాం

 

👉జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 15కోట్ల మందికి లబ్ధి చేకూరరింది

👉బ్యాంకింగ్‌ వ్యవస్థ బలోపేతమైతే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత వృద్దిని సాధిస్తుంది

 👉ప్రపంచ స్థాయిలో మన బ్యాంకుల్ని బలోపేతం చేశాం

👉యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి

 👉మరో 10 కోట్ల మంది మహిళలు కొత్తగా స్వయం సంఘాల్లో చేరారు

 👉కోటిమంది మహిళలను లక్షాదికారులుగా మారుస్తాం

 

👉దళితులు, పీడితులు,పండితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలి

👉జీ.20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించాం

👉ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయి భారత్‌ ఎదగాలి

👉దేశాభివృద్దికి పాలనా సంస్కరణలు అవసరం

👉అంతరిక్షంలో భారత్‌ స్పేస్‌ సెంటర్‌ కల సాకరం కావాలి

👉భారత్‌ ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మారాలి

👉గత కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి

👉ప్రకృతి విపత్తులతో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం

👉భారత్‌ ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మారాలి

👉న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం

👉 40కోట్ల మంది స్వాతంత్య్రం సంపాదిస్తే.. 140 కోట్ల మంది ఎంతైనా సాధించవచ్చు.

👉లక్ష్యాన్ని నిర్ధేవించుకొని ముందుకు సాగాలి

👉ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం వారి జీవితాల్ని పణంగా పెట్టారు. 

👉దేశం కోసం పోరాడిన మహనీయుల్ని స్మరించుకుందాం



 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement