red port
-
ఎర్రకోట వేదికగా కేంద్రం రాహుల్ గాంధీని అవమానించిందా?
ఢిల్లీ : ఎర్రకోట వేదికగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరుదైన ఘనత సాధించారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి కేంద్రం సరైన గౌరవం ఇవ్వలేదనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడకలకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ చివరి వరుసలో ఒలింపిక్ పతక విజేతలతో కలిసి కూర్చున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.తెల్లటి కుర్తా-పైజామా ధరించిన రాహుల్ గాంధీ భారత హాకీ జట్టు ఫార్వర్డ్ గుర్జంత్ సింగ్ పక్కన కూర్చున్నట్లు కనిపించారు. ముందు వరుసలో ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, సరబ్జోత్ సింగ్ ఉన్నారు. ఒలింపిక్ కాంస్య విజేత హాకీ జట్టు సభ్యులు, ఆ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్,పీఆర్ శ్రీజేష్ కూడా రాహుల్ కంటే ముందు భాగంలో కూర్చున్నారు.For first time in 10yrs a leader of opposition attended the Independence Day celebrations in Delhi, but he wasn't offered the front row seat as per protocol@RahulGandhi was made to sit in 2nd last row behind Olympians, even though the Leader of opposition rank is equivalent to… pic.twitter.com/7tF9GZsUTe— Nabila Jamal (@nabilajamal_) August 15, 2024 ప్రోటోకాల్ ప్రకారం, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడికి, క్యాబినెట్ మంత్రికి సమానమైన ర్యాంక్ ఉన్నవారికి ఎల్లప్పుడూ ముందు వరుసలో సీటు కేటాయించబడుతుంది. ముందు వరుసలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్,అమిత్ షా,ఎస్ జైశంకర్ ఉన్నారు.స్పందించిన కేంద్రం రాహుల్ గాంధీ సీటింగ్ ఏర్పాటుపై సోషల్ మీడియాలో చర్చలు జరగడంతో, ఒలింపిక్ పతక విజేతలకు ముందు వరుసలు కేటాయించడంతో రాహుల్ గాంధీ సీటును వెనక్కి మార్చాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం, సీటింగ్ ప్లాన్లను రూపొందించడం రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యత.అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూఅటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనూ.. ఆ తరువాత బీజేపీ హయాంలోనూ.. అప్పటి లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న సోనియా గాంధీకి ఎప్పుడూ మొదటి వరుసలో సీటు కేటాయించడం జరిగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి స్థానం 2014 నుంచి ఖాళీగానే ఉంది. ఎందుకంటే దిగువ సభ బలంలో పదో వంతు మెజారిటీని ఏ పార్టీ సాధించడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం చేసుకుంది. అంతకు ముందు ఎన్నికల్లో అంటే 2014, 2019 ఎన్నికలలో 543 మంది సభ్యుల సభ కాంగ్రెస్ వరుసగా 44,52 స్థానాలను గెలుచుకుంది. దీంతో దశాబ్ధ కాలం పాటు ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి తగ్గలేదు. మొత్తానికి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. అయినా సరే..రాహుల్ సీటును ఎన్డీఏ చివరి వరుసలో ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సోవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ అవసరమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రజలందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలన్ని ప్రధాని.. దేశ అభివృద్ధి కోసం వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అవసరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు నెలలకు ఓసారి ఎన్నికలు వస్తున్నాయని, దీనివల్ల అభివృద్ధికి, వనరులకు విఘాతం కలుగుతుందన్నారు. దీనిపై రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చాలని ప్రజలకు సూచించారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమన్నారు ప్రధాని మోదీ. మహిళలపై నేరాలను అరికట్టేందుకు సమాజమంతా బాధ్యత తీసుకోవాలని హితవు పలికారు. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని, రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబాలను నుంచి లక్షల మంది రావాలన్నారు. ఏ పార్టీ నుంచి అయినా వారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికన పక్షంలో కొత్త ఆలోచనలు, కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చినట్లు అవుతుందన్నారు. తద్వారా వారసత్వ రాజకీయాలు, కుల, మత రాజకీయాలకు అడ్డుకట్టపడుతుందన్నారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు👉భారత్ ప్రస్థానం ప్రపంచానికి స్పూర్తిదాయకం 👉అంతరిక్ష రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదిగింది👉భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు భారత్ సంకల్పం తీసుకుంది👉దేశాభివృద్ధికి భారీ ప్రణాళికలు అవసరం👉వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ నినాదం👉వోకల్ ఫర్ లోకల్ అనే నినాదం దేశ ఆర్ధిక వ్యవ్యస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది👉దేశాభివృద్ధికి భారీ ప్రణాళికలు అవసరం👉సర్జికల్ స్ట్రైక్‌ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారు👉తయారీ రంగంలో భారత్ గ్లోబుల్ హబ్‌గా మారాలి👉భారత్ తర్వలోనే ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది👉మౌలిక సదుపాయాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చాం. 👉విదేశాలకు వెళ్లి చదివే దుస్థితిని తగ్గిస్తాం👉మెడికల్ సీట్ల సంఖ్యను భారీగా పెంచబోతున్నాం👉మెడిసిన్ చదివేందుకు యువత విదేశాలకు వెళ్తోంది👉దేశంలో అత్యాచారం ఘటనలను తీవ్రంగా ఖండిస్తాం👉నిందితులకు కఠిన శిక్ష పడిన సందర్భాలకు ప్రచారం జరిగితే నేరస్తుల్లో భయం పుడుతుంది👉మెడికల్ సీట్ల సంఖ్యను భారీగా పెంచబోతున్నాం👉మెడిసిన్ చదివేందుకు యువత విదేశాలకు వెళ్తోంది👉నిందితులకు కఠిన శిక్ష పడిన సందర్భాలకు ప్రచారం జరిగితే నేరస్తుల్లో భయం పుడుతుంది #WATCH | PM Narendra Modi says, "...I would like to express my pain once again, from the Red Fort today. As a society, we will have to think seriously about the atrocities against women that are happening - there is outrage against this in the country. I can feel this outrage.… pic.twitter.com/2gQ53VrsGk— ANI (@ANI) August 15, 2024👉దోషులను అంత కఠినంగా శిక్షిస్తే అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు 👉దేశంలో ఎక్కడ అత్యాచారాలు జరిగినా మీడియా హైలెట్ చేస్తోంది👉మాతృభాషను ఎవరు విస్మరించొద్దు👉ఉపాధి కల్పనలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాం #WATCH | On the 78th Independence Day, PM Modi urges all levels of government, from panchayat to central government, to work on improving ease of living at a mission mode(Video source: PM Modi/YouTube) pic.twitter.com/zT9zVN7uNX— ANI (@ANI) August 15, 2024👉జల్ జీవన్ మిషన్ ద్వారా 15కోట్ల మందికి లబ్ధి చేకూరరింది👉బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతమైతే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత వృద్దిని సాధిస్తుంది 👉ప్రపంచ స్థాయిలో మన బ్యాంకుల్ని బలోపేతం చేశాం👉యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి 👉మరో 10 కోట్ల మంది మహిళలు కొత్తగా స్వయం సంఘాల్లో చేరారు 👉కోటిమంది మహిళలను లక్షాదికారులుగా మారుస్తాం#IndependenceDay2024 | From the ramparts of Red Fort, PM Modi says, "For Viksit Bharat 2047, we invited suggestions from the countrymen. The many suggestions we received reflect the dreams and aspirations of our citizens. Some people suggested making India the skill capital, some… pic.twitter.com/vR8aG79uVw— ANI (@ANI) August 15, 2024 During his #IndependenceDay2024 speech, PM Modi says, "Be it tourism, education, health, MSME, transport, farming and agriculture sectors- in every sector a new modern system is being created. We want to move forward by adopting best practices by integration of technology."… pic.twitter.com/TNUUlcSSy0— ANI (@ANI) August 15, 2024👉దళితులు, పీడితులు,పండితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలి👉జీ.20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించాం👉ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయి భారత్ ఎదగాలి👉దేశాభివృద్దికి పాలనా సంస్కరణలు అవసరం👉అంతరిక్షంలో భారత్ స్పేస్ సెంటర్ కల సాకరం కావాలి👉భారత్ ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మారాలి👉గత కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి👉ప్రకృతి విపత్తులతో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం👉భారత్ ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మారాలి👉న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం👉 40కోట్ల మంది స్వాతంత్య్రం సంపాదిస్తే.. 140 కోట్ల మంది ఎంతైనా సాధించవచ్చు.👉లక్ష్యాన్ని నిర్ధేవించుకొని ముందుకు సాగాలి👉ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం వారి జీవితాల్ని పణంగా పెట్టారు. 👉దేశం కోసం పోరాడిన మహనీయుల్ని స్మరించుకుందాం #WATCH | PM Modi as he left from his official residence for Red Fort to address the nation on 78th #IndependenceDay pic.twitter.com/wrPo7v9znm— ANI (@ANI) August 15, 2024 -
జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవాన్ని స్వీకరించిన అనంతరం జెండానుఎగరేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి, అమరవీరులకు నివాళి అర్పించారు. కాగా ఎర్రకోటపై మోదీ జాతీయ జెండాను ఎగరవేయడం ఇది ఆరోసారి. ఈ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలు నిర్వహించిన ప్రత్యేక విన్యాసాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భద్రతా దళాలకు చెందిన వివిధ విభాగాలు ప్రత్యేక దుస్తులు ధరించి విన్యాసాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ రక్షాబంధన్, స్వాంతత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎర్రకోటపై బీసీ జెండా ఎగరేస్తాం: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఎర్రకోటపై బీసీ జెండా ఎగురవేసి రాజ్యాధికారం సాధించేంతవరకు తమ పోరాటం ఆగదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ సంఘం ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిందన్నారు. న్యాయమైన ఈ డిమాండ్లు అమలు చేస్తేనే బీసీల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. దోమలగూడలోని ఎస్ఎంఎస్లో శుక్రవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కష్ణ, ర్యాగ రమేష్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు నూటపదకొండు సార్లు రాజ్యాంగాన్ని సవరించిన పాలకులు బీసీ సంక్షేమం, అభివృద్ధి కోసం ఒక్క సవరణనైనా చేయకపోవడం శోచనీయమని విమర్శించారు. బీసీలకు పదవులు రాకుండా అగ్రకుల పెట్టుబడిదారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీసీలకు కావల్సింది వాటాలు, కోటాలు కాదని, డిల్లీ పీఠం కావాలన్నారు. కేంద్రంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి చర్యలు తీసుకోవడంలేదన్నారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ జాతీయ స్థాయిలో కనుమరుగవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 28 సార్లు సీఎంలను మార్చితే ఒక్క బీసీకి ఆ పదవి ఇవ్వలేదని, కాంగ్రెసు బీసీ నాయకుల్లో సమర్థులైన వారే లేరా? అని ప్రశ్నించారు. తాను బీసీ ఉద్యమకారుడిగానే ఉంటానే తప్ప ఒక ప్రాంతానికి పరిమితం కానని, రెండు రాష్ట్రాలు ఏర్పడితే ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలో బీసీ ముఖ్యమంత్రినే నియమించాలన్నారు. రాజకీయ పార్టీ పెట్టాలని తమపై ఒత్తిడి వస్తోందని, బీసీలకు న్యాయం చేయకపోతే ప్రజలే పార్టీని ఏర్పాటు చేసుకుంటారని చెప్పారు.