![PM Modi Flag Hoisting At Red Fort In Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/15/Modi.jpg.webp?itok=WU1oD7w_)
సాక్షి, న్యూఢిల్లీ: 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవాన్ని స్వీకరించిన అనంతరం జెండానుఎగరేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి, అమరవీరులకు నివాళి అర్పించారు. కాగా ఎర్రకోటపై మోదీ జాతీయ జెండాను ఎగరవేయడం ఇది ఆరోసారి. ఈ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలు నిర్వహించిన ప్రత్యేక విన్యాసాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భద్రతా దళాలకు చెందిన వివిధ విభాగాలు ప్రత్యేక దుస్తులు ధరించి విన్యాసాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ రక్షాబంధన్, స్వాంతత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment