రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పి భరించ లేకుంటే చిన్న చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు.ఈ సమయంలో నీళ్లు మామూలుకంటే ఎక్కువగా తాగాలి. హెర్బల్ టీ తాగినా కూడా ఫలితం ఉంటుంది. పుదీన, అల్లం వేసుకుని టీ తాగినా, మరే ఇతర వేడి పానీయం తాగినా ఈ నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది ∙వేడి నీటిలో చిన్న టవల్ ముంచి కింది పొట్ట మీద వేస్తే ఉపశమనం ఉంటుంది తేలికపాటి ఎక్సర్‌సైజ్‌లు, యోగసాధన చేస్తే రక్త ప్రసరణ క్రమబద్ధమవుతుంది, శారీరక వ్యాయామంతో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది.
ఇది కండరాల మీద ఒత్తిడిని తగ్గించి హాయినిస్తుంది ∙పెల్విక్ కండరాల మీద ఒత్తిడి కలిగి ఎక్సర్‌సైజ్ చేస్తే కండరాలు వదులై నొప్పి కలగదు ∙ఈ సమయంలో రోజూ పడుతున్న శ్రమ తగ్గించుకోవాలి. వీలయితే కొంత సేపు విశ్రాంతిగా పడుకుంటే మంచిది. ఉదయం కాని సాయంత్రం కాని అరగంట సేపు వాకింగ్ చేస్తే నొప్పికి దూరం కావచ్చు.
కడుపు నొప్పి తగ్గాలంటే...
Published Thu, Aug 2 2018 1:51 AM | Last Updated on Thu, Aug 2 2018 1:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment